T20 World Cup 2024: ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్.. టీమిండియా సెమీస్ చేరాలంటే ఎంత తేడాతో గెలవాలంటే?
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు 18వ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఢీ కొట్టనున్నాయి. ఆదివారం (అక్టోబర్ 13) రాత్రి జరిగే ఈ మ్యాచ్ భారత జట్టుకు కీలకం .
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు 18వ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఢీ కొట్టనున్నాయి. ఆదివారం (అక్టోబర్ 13) రాత్రి జరిగే ఈ మ్యాచ్ భారత జట్టుకు కీలకం . ఎందుకంటే ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే నేరుగా సెమీస్‌లోకి ఎంట్రీ ఇవ్వగలదు. ఒకవేళ స్వల్ప తేడాతో ఓడితే మాత్రం న్యూజిలాండ్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఫలితం కోసం చూడాల్సిందే. అలా కాకుంటే నేటి మ్యాచ్‌లో నెట్ రన్ రేట్‌లో ఆస్ట్రేలియాను అధిగమిస్తే సెమీఫైనల్‌కు అర్హత సాధించవచ్చు. ప్రస్తుత పాయింట్ల పట్టికలో, ఆస్ట్రేలియా జట్టు 6 పాయింట్లు +2.786 నెట్ రన్ రేట్‌తో అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో టీమ్ ఇండియా 4 పాయింట్లతో +0.576 నెట్ రన్ రేట్‌తో ఉంది. ఆస్ట్రేలియాపై గెలిస్తే భారత జట్టు పాయింట్లు కూడా 6కి చేరుతాయి. మెరుగైన నెట్ రన్ రేట్‌తో ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంటుంది. ఇలా జరగాలంటే ఆస్ట్రేలియాను కనీసం 60 పరుగుల తేడాతో టీమిండియా గెలవాల్సి ఉంటుంది.
సెమీస్ చేరాలంటే టీమిండియా గణాంకాలు..
భారత్ మొదట బ్యాటింగ్ చేసి 180 రన్స్ చేస్తే, ఆస్ట్రేలియాను 117 పరుగులకే కట్టడి చేయాల్సి ఉంటుంది. దీంతో నెట్ రన్ రేట్‌లో ఆస్ట్రేలియాను బీట్ చేస్తుంది.
ఒక వేళ టీమ్ ఇండియా 160 పరుగులు చేస్తే.. ఆస్ట్రేలియా జట్టును 98 పరుగులకే కట్టడి చేయాలి. అంటే, టీమిండియా 60 పరుగుల మార్జిన్‌తో గెలవాల్సి ఉంటుంది.
ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేసి 120 పరుగులు చేసిందనుకుంటే.. అప్పుడు టీమిండియా ఈ స్కోరును 10.1 ఓవర్లలో ఛేదించాల్సి ఉంటుంది.
ఒకవేళ ఆస్ట్రేలియాపై టీమిండియా స్వల్ప తేడాతో విజయం సాధిస్తే మాత్రం.. పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌లో కివీస్ జట్టు ఓడిపోవాలని కోరుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ న్యూజిలాండ్ 20 రన్స్ కంటే తక్కువ తేడాతో గెలిస్తే.. నెట్ రన్ రేట్ సహాయంతో టీమ్ ఇండియా సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.