NZ vs SL: లంకపై ఘన విజయం.. కట్‌చేస్తే.. టీమిండియా షాకిచ్చిన న్యూజిలాండ్..

ICC Womens T20 World Cup, 2024: షార్జా క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ ఓటమితో టోర్నమెంట్‌లో శ్రీలంక జట్టు ఒక్క గెలుపు లేకుండా ప్రయాణాన్ని ముగించింది.

Update: 2024-10-12 13:07 GMT

ICC Womens T20 World Cup, 2024: షార్జా క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ ఓటమితో టోర్నమెంట్‌లో శ్రీలంక జట్టు ఒక్క గెలుపు లేకుండా ప్రయాణాన్ని ముగించింది. అలాగే, కివీస్ జట్టు పాయింట్ల సంఖ్యను నాలుగుకు పెంచుకుంది. మరో గేమ్‌లో గెలిస్తే సెమీస్ రేసులో ముందంజ వేస్తుంది.

అంతకుముందు టాస్ గెలిచిన చమరి అటపట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అమేలియా కేర్ చేతికి చిక్కి పెవిలియన్ చేరింది. ఈ క్రమంలో ఆమె 41 బంతుల్లో 35 పరుగులు చేసి సత్తా చాటింది. దీంతో శ్రీలంక జట్టు మొత్తం 115 పరుగులు చేయగలిగింది. కెర్, లీ కాస్పెరెక్ ఒక్కొక్కరు రెండు వికెట్లు పడగొట్టారు.

116 పరుగులు టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్ జట్టు జార్జియా ప్లిమ్మర్ 44 బంతుల్లో 53 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి లంక బౌలర్లపై విరుచుకపడింది. అలాగే, కెర్ (31 బంతుల్లో 34*), కెప్టెన్ సోఫీ డివైన్ (8 బంతుల్లో 13*) కీలక భాగస్వామ్యంతో న్యూజిలాండ్ జట్టు మరో 15 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

ఇరు జట్లు:

న్యూజిలాండ్ మహిళలు (ప్లేయింగ్ XI): సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, అమేలియా కెర్, సోఫీ డివైన్(కెప్టెన్), బ్రూక్ హాలిడే, మాడీ గ్రీన్, ఇసాబెల్లా గాజ్(కీపర్), లీ కాస్పెరెక్, లీ తహుహు, రోజ్మేరీ మెయిర్, ఈడెన్ కార్సన్.

శ్రీలంక మహిళలు (ప్లేయింగ్ XI): విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని(కీపర్), సచిని నిసంసాలా, అమ కాంచన, సుగండిక కుమారి, ఇనోషి ప్రియదర్శని, ఉదేశిక ప్రబోధని.

Tags:    

Similar News