Gautam Gambhir: ఆ ఒక్క విషయంలో తప్ప ధోనితో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు

* టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ప్రస్తుత యువ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ ని ప్రశంసలతో ముంచెత్తాడు.

Update: 2021-09-11 07:07 GMT

ధోని - గౌతమ్ గంభీర్ (ఫైల్ ఫోటో)

Gautam Gambhir: టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ప్రస్తుత యువ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ ని ప్రశంసలతో ముంచెత్తాడు. తాజాగా బిసిసిఐ విడుదల చేసిన టీ20 ప్రపంచ కప్ జట్టులో సూర్య కుమార్ యాదవ్ కి చోటు దక్కిన విషయం తెలిసిందే. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ శ్రేయాస్ అయ్యర్ ను రిజర్వ్ లో ఉంచి బిసిసిఐ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక బిసిసిఐ ఎంపిక చేసిన భారత జట్టు గురించి గౌతమ్ గంభీర్ స్టార్ స్పోర్ట్స్ "ఫాలో ది బ్లూ" షోలో మాట్లాడుతూ శ్రేయాస్ అయ్యర్ తో పోలిస్తే సూర్యకుమార్ యాదవ్ మంచి ఆటగాడని, అలాంటి ఆటగాడు టీ20 క్రికెట్ అన్ని రకాల షాట్స్ ఆడగలడని తెలిపాడు.

మిడిల్ ఆర్డర్ లో సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ తో రాణిస్తాడనే నమ్మకం ఉందని తెలిపాడు. మరోపక్క హెడ్ కోచ్ రవిశాస్త్రి, విక్రమ్ రాథోడ్ వంటి సీనియర్ లు ఉన్న తరువాత మహేంద్ర సింగ్ ధోనిని మెంటర్ గా తీసుకోవడం వలన పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చని, యువ ఆటగాళ్ళు సూర్య కుమార్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చహార్ వంటి యువ ఆటగాళ్ళకు సలహాలు, మెళకువలు నేర్పించడానికి.., నాకౌట్ మ్యాచ్ లలో తన అనుభవం ఉపయోగపడొచ్చని అంతకు మించి పెద్దగా ధోనితో అవసరం ఉండకపోవచ్చని గంభీర్ తెలిపాడు. 

టీం ఇండియా 


Tags:    

Similar News