మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఇంట్లో విషాదం.. ఆ విషయాన్ని దాచి మరీ లతాజీకి సంతాపం..
Suresh Raina: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఇంట్లో విషాధం నెలకొంది.
Suresh Raina: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఇంట్లో విషాధం నెలకొంది. రైనా తండ్రి త్రిలోక్‌చంద్ రైనా ఆదివారం కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న రైనా తండ్రి త్రిలోక్‌చంద్ రైనా ఇవాళ తుదిశ్వాస విడిచారు. త్రిలోక్‌చంద్ రైనా సైనికాధికారి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో బాంబులు తయారు చేయడంలో ఆయన చాలా నైపుణ్యం గలవాడు. రైనా పూర్వీకులది జమ్ముకశ్మీర్‌లోని 'రైనావరి' గ్రామం. 1990ల్లో కశ్మీర్ పండితుల ఊచకోత తర్వాత త్రిలోక్‌చంద్ కశ్మీర్ నుంచి కుటుంబంతో సహా మురాదాబాద్ పట్టణానికి వచ్చాడు.
మురాద్‌నగర్‌లో స్థిరపడ్డారు. ఆ సమయంలో తనకు వచ్చే రూ.10వేల జీతంతో.. సురేశ్ రైనా క్రికెట్ కోచింగ్ ఫీజులను కట్టలేకపోయేవారు. 1998లో లఖ్‌నవూలోని గురుగోవింద్ సింగ్ స్పోర్ట్స్ కళాశాలలో చేరాడు సురేశ్ రైనా. కశ్మీర్ ఉదంతం గురించి తన తండ్రికి జ్ఞాపకం తెచ్చే ఏ అంశాన్ని మాట్లాడకుండా ఎల్లప్పుడూ జాగ్రత్త పడేవాడినని రైనా గతంలో చెప్పాడు. ప్రస్తుతం సురేశ్ రైనా ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొనబోతున్నాడు. గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన రైనా 'చిన్న తలైవా'గా గుర్తింపు పొందాడు. అయితే తన తండ్రి మరణాన్ని రైనా వెల్లడించలేదు. ఆ విషయాన్ని దాచి మరీ ఆదివారం మరణించిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతికి సంతాపం ప్రకటించాడు రైనా.