SRH: 'అంత ఆవేశం పనికిరాదు బ్రో.. కాస్త తగ్గండి..' SRHకు టీమిండియా స్టార్‌ చురకలు!

SRH అగ్రెసీవ్‌ బ్యాటింగ్‌ అప్రోచ్‌ ఫలితాలివ్వడం లేదని పుజారా చెప్పాడు.

Update: 2025-03-31 12:56 GMT

SRH: 'అంత ఆవేశం పనికిరాదు బ్రో.. కాస్త తగ్గండి..' SRHకు టీమిండియా స్టార్‌ చురకలు!

SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట శైలి‌పై మళ్లీ చర్చ మొదలైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు బౌలర్ల ధాటికి కేవలం 163 పరుగులకే ఆలౌట్ అయింది. ఆరంభం నుంచే దూకుడు చూపించాలన్న ప్రయత్నంలో వరుసగా వికెట్లు కోల్పోయారు. ఐదో ఓవర్ పూర్తయ్యే సరికి నాలుగు కీలక వికెట్లు కోల్పోయారు. అయినప్పటికీ హెడ్ కోచ్ డానియెల్ వెటోరి, అదే ధోరణితో కొనసాగుతామని చెప్పడం క్రికెట్ నిపుణుల ఆందోళనకు కారణమైంది.

పిచ్ నెమ్మదిగా ఉంటుందన్న అంచనాతో టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకోవడంపైనే చతేశ్వర్ పుజారా అసంతృప్తి వ్యక్తం చేశాడు. మధ్యాహ్నం మ్యాచ్‌లో స్పిన్నర్ల సహాయంతో బౌలింగ్ చేయడం ఉత్తమమని సూచించాడు. ఆటపై SRH దృష్టిని నిలిపేలా వ్యూహం లోపించిందని, గట్టి దాడికి వెళ్లే ముందు పరిస్థితేంటో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు.

అటు అనికేత్ వర్మ 41 బంతుల్లో 74 పరుగులు చేసి క్లాసెన్‌తో కలిసి 77 పరుగుల భాగస్వామ్యం ద్వారా జట్టుకు కొంత గౌరవ ప్రదర్శన తీసుకువచ్చాడు. కానీ ఆ భాగస్వామ్యం ముగిసిన వెంటనే మళ్లీ డీలాపడిపోయారు. ఇయాన్ బిషప్ అభిప్రాయం ప్రకారం, క్లాసెన్ మరింత సమయాన్ని కేటాయించి చివరి వరకూ నిలబడాల్సిందని, దాంతో స్కోరు ఎక్కువవుతుందన్నది స్పష్టమైంది. ఇటీవల మ్యాచ్‌లలో వరుసగా రెండు ఓటములు ఎదుర్కొన్న SRH తమ వ్యూహాన్ని పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని పుజారా పేర్కొన్నాడు. గత సీజన్‌లోనూ లీగ్ దశలో మెరిసినా, పైనల్స్‌లో ఒక్క తప్పిదమే వెనక్కి నెట్టిందని గుర్తుచేశాడు. ప్లాన్ బీ లేనిది ప్రమాదకరమని హెచ్చరించాడు.

దూకుడైన ఆట ప్రణాళిక ఓ స్థాయిలో ఆకర్షణీయంగా కనిపించినా, అదే శైలిలో స్థిరంగా విజయాలు సాధించకపోతే దీని ఫలితం ఏమిటన్నదే ఇప్పుడు విమర్శకుల ప్రశ్న. మంచి బ్యాలెన్స్‌తో, ఆలోచనతో ఆడే ఆటగాళ్లు టీమ్‌కు అవసరమని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు.

Tags:    

Similar News