Tilak Varma: SRH జట్టులోకి తిలక్ వర్మ? ఆ చర్య అర్థం అదేనా?
Tilak Varma: ఇప్పటికీ ఈ వ్యవహారం ముంబై డ్రెస్సింగ్‌రూమ్‌లో ప్రశాంతతకు దూరం చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Tilak Varma: SRH జట్టులోకి తిలక్ వర్మ? ఆ చర్య అర్థం అదేనా?
Tilak Varma: తిలక్ వర్మ. ఐపీఎల్‌లో ఒక సంచలనాత్మక పేరు. టెక్నిక్, టెంపరమెంట్ రెండింటిలోనూ అద్భుతమైన బ్యాటర్‌గా గుర్తింపు పొందిన తిలక్… ఇప్పుడు ఒక వాదన మధ్యలో చిక్కుకున్నాడు. ప్రతి ఆటగాడికీ బాడ్ డే అనేది సహజం. అయినా తిలక్ వంటి ఆటగాడిని బ్యాటింగ్ మధ్యలోనే రిటైర్డ్ అవుట్ చేయడం, అది కూడా అతను గాయపడి కాదు… బ్యాటింగ్ నెమ్మదిగా సాగుతుందనే ఒక్క కారణంతో… అన్నివైపుల నుంచి విమర్శలకు దారితీస్తోంది.
లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 204 పరుగుల ఛేజ్ చేస్తూ ముంబై ఇబ్బంది పడుతున్న వేళ, తిలక్ వర్మ 23 బంతుల్లో 25 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కానీ 19వ ఓవర్లో ఆకస్మికంగా అతడిని డగౌట్‌కు పిలిపించారు. ఈ నిర్ణయం ఆ జట్టులోనూ పాజిటివ్‌గా తీసుకోలేదన్నది సూర్యకుమార్ యాదవ్ రియాక్షన్ చూస్తే స్పష్టమవుతోంది. ఇదే సమయంలో తిలక్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలోంచి ముంబై ఇండియన్స్ పేరును తొలగించాడని వార్తలొస్తుండటంతో, ఈ వ్యవహారం మరింత ముదిరింది.
తిలక్ వర్మ ముంబైకి కొత్తవాడు కాదు. 2022 నుంచి ఆ జట్టులో కీలక ప్లేయర్. మిడిలార్డర్‌లో ఎన్నో విజయాల్లో అతడి పాత్ర కీలకం. ఒక్కరిగా నిలబడి జట్టును గెలిపించిన సందర్భాలు అనేకం. అలాంటి ఆటగాడిని బ్యాటింగ్ మధ్యలోనే తీసివేసిన తీరు అతడి మనోస్థితిపై ప్రభావం చూపినట్టే కనిపిస్తోంది. గతంలో కూడా చాలా మంది ఆటగాళ్లు ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. కానీ వాళ్లలో ఎవ్వరూ ఆట మిడిలోనే తప్పించుకోలేదు.
ఈ నిర్ణయం ముంబై టీం కోచ్ జయవర్దనే తీసుకున్నదా, లేక కెప్టెన్ హార్దిక్ పాండ్యా భావనల ఫలితమా అనే చర్చ కొనసాగుతోంది. కానీ హార్దిక్ పాండ్యా గతంలో తాను కూడా నెమ్మదిగా ఆడినప్పుడు అలాంటి నిర్ణయాన్ని ఎవరూ తీసుకోలేదన్నది మరో విరుద్ధతగా నిలిచింది.
ఇదంతా తిలక్ నమ్మకాన్ని దెబ్బతీయే అవకాశం ఉంది. సోషల్ మీడియా, మాజీ ఆటగాళ్లు కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన తిలక్‌పై ఇప్పుడు సన్‌రైజర్స్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. తిలక్ ముంబైను వదిలి హోమ్ ఫ్రాంచైజీలోకి వస్తాడా అనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఇవన్నీ జరిగినా తిలక్ ఎదుగుదలలో ముంబై పాత్రను విస్మరించలేం. అదే సమయంలో ముంబై జట్టుతో అతడి సంబంధం కొనసాగుతుందా లేక కొత్త దారిలో నడుస్తాడా అన్నది సమయం తేల్చాలి.