Sourav Ganguly: గంగూలీని సత్కరించిన బ్రిటిష్ పార్లమెంట్
Sourav Ganguly: అరుదైన సన్మానంతో ఆనందంగా ఉందన్న బీసీసీఐ ప్రెసిడెంట్
Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం లభించింది. గంగూలీని బ్రిటిష్ పార్లమెంట్ సత్కరించింది. ఈ విషయాన్ని గంగూలీ స్వయంగా వెల్లడించారు. తనను ఒక బెంగాలీగా బ్రిటిష్ పార్లమెంటు సత్కరించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు గంగూలీ. ఈ అరుదైన సన్మానం కోసం బ్రిటిష్ పార్లమెంట్ తనను ఆరు నెలల క్రితమే సంప్రదించిందన్నారు. బ్రిటిష్ పార్లమెంట్ ప్రతి ఏడాది ఒకరిని ఇలా గౌరవిస్తుందని, ఈసారి ఆ అవకాశం తనకు లభించిందన్నారు.
2002 జులై 13న జరిగిన నాట్ వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో గంగూలీ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ ను ఓడించి విజేతగా నిలిచింది. మళ్లీ 20 ఏళ్ల తర్వాత అదే గడ్డ మీద గంగూలీకి సన్మానం జరగడం విశేషం. ఇటీవల లండన్లో తన కూతురు బర్త్ డే వేడకుల సందర్భంగా చేసిన డ్యాన్స్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక భారత క్రికెటర్ల పర్ఫామెన్స్ గురించి అంచనాలు ఎక్కువగా ఉంటాయని, అయినా మనవాళ్ల పర్ఫామెన్స్ అంత పూర్ గా ఏమీ లేదన్నారు.