Boxing day test: ఆసీస్ దుమ్ము దులిపిన భారత్ బౌలర్లు..రెండో టెస్ట్ లో టీమిండియా ఘనవిజయం!

Update: 2020-12-29 04:31 GMT

ఆస్ట్రేలియా తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో మొదటి టెస్ట్ లో ఘోర పరాజయం తరువాత టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ జట్టును ఊపిరి తీసుకునే అవకాశం ఇవ్వకుండా నాలుగో రోజే విజయం సాధించింది. 

మొదటి ఇన్నింగ్స్ లో కెప్టెన్ రహానే అద్భుత శతకంతో ఆసీస్ పై ఆధిక్యాన్ని సాధించిన భారత్ తరువాత ఆస్ట్రేలియాకు ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ బ్యాట్స్ మెన్ ను 200పరుగులకే కట్టడి చేశారు భారత బౌలర్లు. దీంతో 69 పరుగుల విజయలక్షయంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసి విజయదుందుభి మోగించింది. మ్యాన్ ఆఫ్ మ్యాచ్ గా రహానే ఎంపికయ్యాడు. 

విజయలక్ష్యం చిన్నదే అయినప్పటికీ భారత్ ఆదిలోనే రెండు వికెట్లను త్వర త్వరగా కోల్పోయింది. మయాంక్ అగర్వాల్ 5 పరుగులు, పుజారా 3 పరుగులు చేసి ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టారు. అయితే ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ రహానే 40 బంతుల్లో మూడు ఫోర్లతో 27 పరుగులు, శుభమం గిల్ 36 బంతుల్లో 7 ఫోర్లతో ౩౫ పరుగులు చేయడంతో భారత్ జట్టు సునాయాస విజయం సాధించింది. 

ఈ విజయంతో సిరీస్ సమం చేసిన భారత్ జట్టు నాలుగు టెస్టుల సిరీస్ లో మూడో టెస్ట్ మ్యాచ్ సిడ్నీ వేదికగా జనవరి 7 నుంచి ఆడనుంది. 

Tags:    

Similar News