మరో సందడికి సిద్ధం అవుతోన్న విజయవాడ ఇంద్రకీలాద్రి

ఆలయ వైదిక కమిటీ భవానీ మండల దీక్ష తేదీలను ఖరారు చేసింది. భవనీమాలధారులతో ఇంద్రకీలాద్రి భవానీలకీలాద్రిగా మారనున్నది.

Update: 2020-10-30 04:32 GMT

విజయవాడ ఇంద్రకీలాద్రి మరో సందడికి సిద్ధమవుతోంది. కోవిడ్ నిబంధనల మధ్య దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగిపోయాయి. తాజాగా ఆలయ వైదిక కమిటీ భవానీ మండల దీక్ష తేదీలను ఖరారు చేసింది. భవనీమాలధారులతో ఇంద్రకీలాద్రి భవానీలకీలాద్రిగా మారనున్నది. ఇందుకోసం ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.


బెజవాడ ఇంద్రకీలాద్రి భవానీ మాలధారులతో అరుణ కీలాద్రిగా మారనున్నది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు ఇతర పూజలన్నీ కోవిడ్ నిబంధనలతో జరుపుతున్నారు. నవంబర్ 25 నుంచి జనవరి 9వ తేదీ వరకు భవానీ మండల దీక్ష తేదీలను ప్రకటించింది ఆలయ వైదిక కమిటీ. పూర్తి మండల దీక్ష ఉండే భక్తులు వచ్చె నెల 25 నుంచి 30 వరకు మాల ధరించ వచ్చని.. అర్ధ మండల దీక్ష ధరించి వారు డిసెంబర్ 15 నుంచి 19 లోగా మాలధారణ వేసుకోవాలని తెలిపారు. డిసెంబర్ 29న మార్గశిర పూర్ణిమ రోజున కలశ జ్యోతి ఊరేగింపు నిర్వహించనున్నారు.


భవానీ దీక్ష చేపట్టిన భక్తులు జనవరి 5 నుంచి 9వ తేదీ వరకు ఐదు రోజుల పాటు మాలధారణ విరమణ రోజులుగా నిర్ణయించారు. కోవిడ్ నిబంధనలను పరిగణలోకి తీసుకుని భవాని భక్తులు తప్పని సరిగా ఆన్ లైన్ లోనే టికెట్లు తీసుకోవాలని ఆలయ ఈవో సురేష్ బాబు తెలిపారు.


ఇంద్రకీలాద్రిపై ఎంతో వైభవంగా జరగాల్సిన అన్ని పండుగలు కరోనాతోనే వెళ్లిపోతున్నాయి. భక్తులు లేకుండానే ఉత్సవాలు నిర్వహిస్తుండటంతో వెలవేలబోతున్న ఇంద్రకీలాద్రి భవానీ భక్తులతో సందడి నెలకొననున్నది.

భవానీ దీక్షల కార్యక్రమాలు ఇలా..

* నవంబర్ 25 నుంచి జనవరి 9 వరకు భవానీ మండల దీక్ష

* పూర్తి మండల దీక్ష ధరించే వారికి నవంబర్ 25 నుంచి 30 వరకు మాలధారణ

* అర్ధ మండల దీక్ష ధరించే వారికి డిసెంబర్ 15 నుంచి 19 వరకు మాలధారణ

* డిసెంబర్ 29న మార్గశిర పూర్ణిమ రోజున కలశజ్యోతి ఊరేగింపు

* జనవరి 5 నుంచి 9వరకు మాలధారణ విరమణ

* కోవిడ్ నిబంధనల ప్రకారం ఆన్ లైన్లోనే టికెట్లు

Tags:    

Similar News