Vastu Tips: అన్ని ఉన్నా ఏదో లోటా.? అయితే ఈ వాస్తు చిట్కాలు పాటించాల్సిందే.. !

Vastu Tips: సంపాదన ఉంటుంది, అవసరమైన వస్తువలన్నీ ఉంటాయి, సరిపడ ఆదాయం ఉంటుంది. కానీ నిత్యం ఏదో తెలియని వెలితి.

Update: 2024-06-10 01:30 GMT

Vastu Tips: అన్ని ఉన్నా ఏదో లోటా.? అయితే ఈ వాస్తు చిట్కాలు పాటించాల్సిందే.. !

Vastu Tips: సంపాదన ఉంటుంది, అవసరమైన వస్తువలన్నీ ఉంటాయి, సరిపడ ఆదాయం ఉంటుంది. కానీ నిత్యం ఏదో తెలియని వెలితి. మనలో చాలా మంది ఇలాంటి సమస్యను ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనే ఉంటారు. దీనికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. అయితే వాస్తు శాస్త్రంలో కూడా దీనికి కారణాలు చెబుతున్నారు. భారతీయులు ఎంతో విశ్వసించే వాస్తు శాస్త్రంలో మనిషి మానసిక స్థితిపై వాస్తు కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు. కొన్ని రకాల వాస్తు చిట్కాల ద్వారా ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టొచ్చని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ వాస్తు చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇంట్లో నిత్యం ఏదో అలజడి, తెలియని బాధ వెంటాడుతంటే ఆ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లే అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ ఉంటే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోకపోతే ఇలాంటి నెగిటివ్‌ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైంనత వరకు ఇంటిని నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

* ఇంట్లోకి సహజంగా వెలుతురు వచ్చేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అందుకే తూర్పు నుంచి దారాలంగా వెలుతురు, గాలి వచ్చేలా ఉండేందుకు ఆ దిశను ఖాళీగా ఉంచాలి. శరీరంతో పాటు ఇంటిలోకి కూడా సూర్య రక్ష్మి పడేలా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు.

* ఇక ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో తులసి మొక్క ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిత్యం తులసి మొక్కను శుభ్రంగా ఉంచుకుంటూ, నీరు పోస్తూ.. సాయంత్రంతో పాటు ఉదయం దీపం వెలిగించాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది.

* మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే పడుకునే బెడ్ రూమ్‌ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం కచ్చితంగా బెడ్‌ రూమ్‌లో నైరుతిలో ఉండాలని చెబుతున్నారు. అలాగే బెడ్ రూమ్‌లో పడుకునే వారు దక్షిణం లేదా తూర్పు దిశలో తల పెట్టుకొని పడుకోవాలి. బెడ్‌కు ఎదురుగా బాత్‌రూమ్‌ లేకుండా చూసుకోవాలి. అలాగే మంచం కింద కూడా శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు.

* మానసిక స్థితి, భావోద్వేగాలపై గోడలకు వేసే రంగులు కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ప్రశాంతత, సామరస్యాన్ని పెంపొందించే రంగులను ఉపయోగించాలి. ముఖ్యంగా లైట్‌ బ్లూ, గ్రీన్‌, గ్రే కలర్స్‌ను ఎక్కువగా ఉపయోగించాలి. వీటితో పాటు గోడలపై ప్రకృతి దృశ్యాలు, మనస్సుకు ప్రశాంతతను అందించే బొమ్మలను అతికించుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇందులో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్‌ గమనించాలి. 

Tags:    

Similar News