Rohini Karte: రోళ్లు పగిలే రోహిణి కార్తె షురూ.. గ్రహ దోష నివారణలు తెలుసుకోండి..!

Rohini Karte: ఎండాకాలం చివరి దశలో రోహిణి కార్తె వస్తుంది. ఈ సమయంలో సూర్యభగవానుడు అగ్నిగోలంగా మండిపోతాడు.

Update: 2024-05-27 04:33 GMT

Rohini Karte: రోళ్లు పగిలే రోహిణి కార్తె షురూ.. గ్రహ దోష నివారణలు తెలుసుకోండి..!

Rohini Karte: ఎండాకాలం చివరి దశలో రోహిణి కార్తె వస్తుంది. ఈ సమయంలో సూర్యభగవానుడు అగ్నిగోలంగా మండిపోతాడు. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతాయి. ఉదయం 5 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడం ప్రారంభిస్తాడు. సాయంత్రం 6 దాటినా వేడిగాలులు వీస్తూనే ఉంటాయి. అందుకే రోహిణి కార్తె వచ్చిందంటే రోళ్లు పగిలే ఎండలు కొడుతాయని నానుడి ఉంది. ఈసారి బృహస్పతితో సూర్యుడు కలవడం వల్ల ఎండలు మరింత ఎక్కువగా ఉండనున్నాయి. రోహిణి కార్తె మే 25 నుంచి ప్రారంభమై జూన్ 2న ముగుస్తుంది. రోహిణీ కార్తెలో చేయాల్సిన గ్రహదోశ నివారణల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

రోహిణి కార్తెలో ఉదయాన్నే నిద్రలేవాలి. సూర్యుడికి ప్రార్థనలు చేసి రోజు ప్రారంభించాలి. ఇలా చేయడం వల్ల వేడి వల్ల కలిగే వ్యాధుల నుంచి రక్షణ పొందుతారు. ఓం సూర్యాయ నమః అనే మంత్రం జపించాలి. ఈ సమయంలో పేదలకు చల్లని వస్తువులను దానం చేయాలి. బాటసారులకు నీళ్లు ఇవ్వాలి. అలాగే పెరుగు, నిమ్మకాయ, కొబ్బరి నీళ్లు, చల్లని పండ్లను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి. రోహిణి కార్తె సమయంలో ప్రతిరోజూ శివలింగానికి చల్లటి నీటితో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

9 రోజుల రోహిణి కార్తెలో మీ ఇంటికి వచ్చిన వారికి నీళ్లతో పాటు ఏదైనా తీపి పదార్థాలు అందించాలి. రోహిణి కార్తె సమయంలో మహిళలు తమ చేతులకు, కాళ్లకు గోరింటాకు పెట్టుకోవాలి. హెన్నాలో ఉండే చల్లని స్వభావం వల్ల ఇది శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. రోహిణి కార్తెలో పొరపాటున ఎవరితో మంచి చెడులు మాట్లాడకూడదు. ఎలాంటి అబద్ధాలు చెప్పకూడదు. రోహిణి కార్తె సమయంలో వేయించిన మసాలా పదార్థాలు, మాంసం, చేపలు, మద్యం ముట్టుకోవద్దు. రోజుకు రెండుసార్లు స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు, మత విశ్వాసాలను అనుసరించి ఉంటుంది. HMTV వీటిని ధృవీకరించడంలేదు. వీటిని పాటించాలని అనుకుంటే, నిపుణులను సంప్రదించిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకోవాలి.

Tags:    

Similar News