TTD Brahmotsavalu 2024 : ముగిసిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ..ఇవీ ప్రత్యేకతలు

TTD Brahmotsavalu 2024 : గత 10రోజులుగా కన్నుల పండువగా జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఎంత చూసినా తనివితీరనివి. మళ్లీ జరిగినప్పుడే మనం చూసే అవకాశం ఉంటుంది. మరి ఈసారి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకతలేంటో చూద్దామా

Update: 2024-10-13 04:27 GMT

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించామని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. ఈసారి 15లక్షల మంది భక్తులు వాహన సేవలను చూసేవిధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. గరుడ సేవ రోజున మూడున్నర లక్షల మంది భక్తుల స్వామివారి వాహన సేవను దర్శించుకున్నారని ఈవో వివరించారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించామని తెలిపారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చే విధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించామని తెలిపారు. 8రోజుల్లో 6లక్షల మంది భక్తులు శ్రీవారి మూల విరాట్ ను దర్శించుకున్నట్లు ఈవో తెలిపారు.

ఇక హుండీ ద్వారా 26కోట్ల కానుకలు వచ్చాయని తెలిపారు. 26లక్షల మంది భక్తులకు అన్నప్రసాద సౌకర్యం కల్పించామని..2.6లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు ఈవో తెలిపారు. ఆర్టీసీ బస్సుల ద్వారా పది లక్షల మంది భక్తులు ఘాట్ రోడ్డులో ప్రయాణించినట్లు తెలిపారు. 30లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించామన్న ఈవో..శ్రీవారి ఆలయంలో 3.2లక్షల మంది భక్తులకు నైవేద్యాన్ని ప్రసాదంగా అందించినట్లు తెలిపారు. 4వేల మంది శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలందించామన్నారు. 68వేల మంది భక్తులకు వైద్య సేవలందించినట్లు శ్యామలరావు వివరించారు.

వచ్చే ఏడాది భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉండే విధంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. మాడవీధుల్లో ఉన్న గ్యాలరీల్లో రిట్రాక్టర్ షెడ్లు ఏర్పాటు చేస్తామని..గ్యాలరీలో చాలా ప్రాంతాల్లో స్టెప్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్యాలరీల వద్ద టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేస్తామని ఈవో శ్యామలరావు వెల్లడించారు.

Tags:    

Similar News