Telugu Horoscope Today: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (October 22, 2024)

Telugu Horoscope Today, October 22, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.

Update: 2024-10-22 00:30 GMT

Telugu Horoscope Today, October 22, 2024

Telugu Horoscope Today, October 22, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు, కృష్ణ పక్షం

తిధి: షష్ఠి అర్ధరాత్రి దాటాక గం.1.28 ని.ల వరకు ఆ తర్వాత సప్తమి

నక్షత్రం: ఆరుద్ర రేపు తె.వా.గం.5.38 ని.ల వరకు

అమృతఘడియలు: రాత్రి గం.7.44 ని.ల నుంచి గం.9.19 ని.ల వరకు

వర్జ్యం: మధ్యాహ్నం గం.2.10 ని.ల నుంచి గం.3.46 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.8.31 ని.ల నుంచి గం. 9.17 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.10.46 ని.ల నుంచి గం.11.36 ని.ల వరకు

రాహుకాలం: మధ్యాహ్నం గం.2.55 ని.ల నుంచి గం.4.22 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.11 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 5.50 ని.లకు

మేషం 

ఆలోచనలు సానుకూలంగా ఉంటాయి. పనులన్నీ విజయవంతం అవుతాయి.. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. ఇరుగు పొరుగుతో సఖ్యత పెరుగుతుంది. తోబుట్టువుల సమస్య పరిష్కరిస్తారు.

వృషభం 

మనసుకి ఇబ్బంది కలిగించే ఘటనలు జరుగుతాయి. అకారణ విరోధాలకూ ఆస్కారం ఉంది. బ్యాంకు లావాదేవీలు అసంతృప్తిని మిగులుస్తాయి. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టాలి. మనశ్శాంతి కరువవుతుంది.

మిథునం 

సత్ప్రవర్తనతో పెద్దల మనసు గెలుచుకుంటారు. గౌరవం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. మనసు ఉల్లాసంగా ఉంటుంది. కీలక సందర్భంలో అదృష్టం వరిస్తుంది.

కర్కాటకం

ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి నడచుకోవాలి. వీలైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. పని సవ్యంగా సాగదు. బంధువులతో విరోధం గోచరిస్తోంది. వేళకు భోజనముండదు. మనశ్శాంతి ఉండదు.

సింహం 

ఆకాంక్ష నెరవేరుతుంది. ధనలాభం ఉంది. కొత్త వస్తువులు తీసుకుంటారు. ఆరోగ్యం మెరుగ్గా టుంది. భూసంబంధ వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. ఇతరులూ సహకరిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు.

కన్య 

అన్నింటా అనుకూలంగా ఉంటుంది. మీ నైపుణ్యంతో పెద్దవారి మన్ననలను పొందుతారు. ఇష్టకార్యం అనుకూలంగా పూర్తవుతుంది. విందుకు హాజరవుతారు. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. గృహశాంతి లభిస్తుంది.

తుల 

పనులు అనుకున్నట్లుగా సాగవు. సంతానం తీరు చికాకు పరుస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా లేకుంటే నష్టపోతారు. శత్రుపీడ ఎక్కువగా ఉంటుంది. పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది.

వృశ్చికం 

ఇష్టం లేని పనిని చేయాల్సి వస్తుంది. కోపాన్ని అణచుకోవడం మంచిది. పోటీలలో ఓటమి చవి చూడాల్సి వస్తుంది. అనుకున్న రీతిలో సౌకర్యాలు సమకూరక పోవడం ఆవేదనను కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.

ధనుస్సు 

వ్యవహారాలు సజావుగా సాగుతాయి. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. శారీరక, మానసిక ఆనందాన్ని పొందుతారు. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. అందరితోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి.

మకరం 

ఆకాంక్ష నెరవేరుతుంది. మిత్రులు తోడుగా నిలుస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ధనలాభం ఉంది. సమస్య పరిష్కారమవుతుంది. అపార్థాలు తొలగుతాయి. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ఉల్లాసంగా ఉంటారు.

కుంభం 

బద్ధకం వల్ల చిక్కులొచ్చే వీలుంది. బాగా ఇష్టంతో చేస్తున్న పనికి ఆటంకాలు వస్తాయి. ఆలోచనలను అదుపులో ఉంచుకోవాలి. వృథా ఖర్చులు పెరుగుతాయి. విలువైన వస్తువులను జాగ్రతగా భద్రపరచుకోండి.

మీనం 

ఆటంకాల వల్ల పనులు సవ్యంగా సాగవు. బుద్ధి నిలకడగా ఉండదు. అయినవారితోనే విరోధాలు వచ్చే వీలుంది. అనవసర ఖర్చులుంటాయి. భూసంబంధ వ్యవహారాల్లో నష్టం గోచరిస్తోంది. జాగ్రత్తగా ఉండాలి.


Full View


Tags:    

Similar News