Navratri 2023: నవరాత్రుల్లో ఈ 3 ఫుడ్స్ బెస్ట్.. రోజంతా శక్తివంతంగా ఉంటారు..!
Navratri 2023: దసరా ముందు వచ్చే దేవి శరన్నవరాత్రోత్సవాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ తొమ్మిది రోజులు దుర్గామాతను తొమ్మిది రూపాల్లో పూజిస్తారు.
Navratri 2023: దసరా ముందు వచ్చే దేవి శరన్నవరాత్రోత్సవాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ తొమ్మిది రోజులు దుర్గామాతను తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. చాలామంది అమ్మవారి అనుగ్రహం కోసం ఈ తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు. దీనివల్ల ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా చాలా ప్రయోజనాలు ఉంటాయి. శరీరాన్ని నిర్విషీకరణ చేయాలనుకునే వారికి ఉపవాసం ఉత్తమ ఎంపిక. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వారికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఉపవాస సమయంలో మూడు రకాల ఆహారాలు తీసుకుంటే రోజు మొత్తం ఎనర్జీటిక్‌గా ఉండవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
సాగో
సాబుదానాన్ని నవరాత్రుల్లో మాత్రమే కాకుండా ప్రతి ఉపవాస సమయంలోనూ తింటారు. ఇది సమృద్ధిగా కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. అందుకే దీనిని సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఇది కాకుండా సాగో గ్లూటెన్ రహితమైనది సులభంగా జీర్ణమవుతుంది. ఉపవాస సమయంలో సాగో ఖిచ్డీ చేసుకొని తింటే చాలా మంచిది.
బుక్వీట్
బుక్వీట్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా నవరాత్రుల్లో బుక్వీట్ పిండికి డిమాండ్ పెరుగుతుంది. ఇందులో విటమిన్ బి, మినరల్స్, ఐరన్ వంటి అనేక అంశాలు ఉంటాయి. డైటరీ ఫైబర్ ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఇది తరచుగా ఆకలి బాధలను నివారిస్తుంది. బుక్వీట్ పిండి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థిరంగా ఉంటుంది.
మఖానా
మఖానా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అధిక మొత్తంలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు ఉంటాయి. అయితే కేలరీల సంఖ్య తక్కువగా ఉంటుంది. బరువు తగ్గే వ్యక్తులకు మఖానా బాగా ఉపయోగపడుతుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.