Raksha Bandhan 2023: రాఖీ కట్టడానికి ఈ నియమాలు పాటించాలి.. లేదంటే దుష్ప్రభావాలు..!

Raksha Bandhan 2023:హిందువుల అతి ముఖ్యమైన పండుగలలో రాఖీ పండుగ ఒకటి.

Update: 2023-08-30 01:30 GMT

Raksha Bandhan 2023: రాఖీ కట్టడానికి ఈ నియమాలు పాటించాలి.. లేదంటే దుష్ప్రభావాలు..!

Raksha Bandhan 2023: హిందువుల అతి ముఖ్యమైన పండుగలలో రాఖీ పండుగ ఒకటి. దీనిని శ్రావణమాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. సోదరసోదరీమణులు ప్రేమకు ప్రతీకగా ఈ పండుగని నిర్వహిస్తారు. ఈ రోజున సోదరీమణులు సోదరులకి రాఖీ కట్టి వారి దీర్ఘాయుష్షు కోసం దేవుడిని ప్రార్థిస్తారు. వారి ఆశీస్సులు తీసుకుంటారు. రాఖీ కట్టినందుకు సోదరులు వారికి బహుమతులు అందిస్తారు. అయితే రాఖీ కట్టడానికి కొన్ని నియమాలు పాటించాలి. లేదంటే చెడు సంఘటనలు జరుగుతాయి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఈ సంవత్సరం ఆగస్టు 30 న రాఖీ పండుగ వస్తుంది. అయితే ఈసారి పౌర్ణమితో పాటు భద్రుడి నీడ కూడా ఉంటుంది. ఈ సమయంలో రాఖీ కట్టడం శ్రేయస్కరం కాదు. అందుకే మంచి గడియలు మొదలయ్యాక రాఖీ కట్టాలి. సోదరులకు రాఖీ కట్టడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అదేవిధంగా కట్టిన రాఖీ తీయడానికి నిబంధనలు ఉన్నాయి. నిజానికి రాఖీ పండుగ అయిపోయిన తర్వాత కట్టిన రాఖీని ఏం చేయాలో చాలా మందికి తెలియదు. కొంతమంది రాఖీని తీసివేసి ఎక్కడ పడితే అక్కడ పారవేస్తారు. ఇలా చేయడం మంచిది కాదు. దీని వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి.

జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం రాఖీ పండుగ ముగిసిన తర్వాత మరుసటి రోజు రాఖీని తీసివేసి సోదరికి సంబంధించిన వస్తువుల దగ్గర పెట్టాలి. అంటే మీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోల దగ్గర లేదంటే ఇద్దరు వాడుకునే వస్తువులు, బహుమతుల దగ్గర పెట్టాలి. వచ్చే ఏడాది రాఖీ పండుగ వరకు భద్రంగా ఉంచాలి. తర్వాత దీనిని తీసివేసి కొత్త రాఖీ ఉంచాలి. చేతికి ఉన్న రాఖీని తీసివేసేటప్పుడు అది విరిగిపోతే పారేయకూడదు. ప్రవహించే నీటిలో వేయాలి.

రాఖీ కట్టడానికి కొన్ని నియమాలు

సోదరుల మణికట్టుపై సోదరీమణులు ఎప్పుడూ నలుపు రంగు లేదా విరిగిన రాఖీని కట్టకూడదు.

రాఖీ కట్టేటప్పుడు సోదరులు ఎప్పుడూ రుమాలుతో తల కప్పుకోవాలి.

భద్ర కాలంలో రాఖీ కట్టకూడదు.

రాఖీ కట్టేటప్పుడు సోదరులు నేలపై కూర్చోవాలి.

సోదరీమణులు నైరుతి దిశలో ఉండి రాఖీ కట్టాలి.

Tags:    

Similar News