Raksha Bandhan 2023: రాఖీ పండుగ రోజు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే..!
Raksha Bandhan 2023 Date: హిందు పండుగలలో ఒక్కోదానికి ఒక్కో రకమైన ప్రాధాన్యత ఉంటుంది.
Raksha Bandhan 2023 Date: హిందు పండుగలలో ఒక్కోదానికి ఒక్కో రకమైన ప్రాధాన్యత ఉంటుంది. అయితే, రాఖీ పండుగ ప్రతీ సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అయితే, ఈ సంవత్సరం మాత్రం అధిక శ్రావణ మాసం వచ్చింది. దీంతో రాఖీ పౌర్ణమి ఎప్పుడు చేసుకోవాలి?, ఏ సమయంలో చేసుకోవాలి? అనేది కూడా ఓ ప్రశ్నార్థకంగా మారింది. రాఖీ పౌర్ణమి ఆగస్టు 30న, 31న అనే అనుమానం వస్తుంది. కాగా, ఈ సంవత్సరం పౌర్ణమి రెండు రోజుల్లోనూ ఉంది. ఇలాంటి సమయంలో అసలు ఎప్పుడు రాఖీ పండుగ చేసుకోవాలి, రాఖీ ఎప్పుడు కట్టాలి? అసలు రాఖీ రోజు చేయాల్సినవి ఏంటివి, చేయకూడనివి ఏంటివి? అనేది తెలుసుకోవాలి.
హిందూ పంచాంగం ప్రకారం, ఆగష్టు 31 న, శ్రావణ పూర్ణిమ తేదీ 07.05 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో భద్ర కాలం ఉండదు. అందుకే ఆగస్టు 31న తెల్లవారుజామున రాఖీ కట్టడం శుభప్రదం.
రాఖీ పండుగ శుభ సమయం..
రాఖీ పండుగ శ్రావణ పూర్ణిమ తేదీ:30 ఆగస్టు 2023
రాఖీ కట్టే సమయం: 30 ఆగస్టు 2023 రాత్రి 09.03 నిమిషాల తర్వాత నుంచి మొదలవుతుంది.
రాఖీ పండుగ శ్రావణ పూర్ణిమ తేదీ ముగింపు- 31 ఆగస్టు ఉదయం 07: 05 నిమిషాల వరకు ఉంటుంది.
రాఖీ పండుగ 2023: చేయవలసినవి, చేయకూడనివి..
- ఎల్లప్పుడూ రాఖీ పండుగను భద్ర లేని కాలంలో మాత్రమే సెలబ్రేట్ చేసుకోవాలి.
రాఖీ రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిలో గంగా జలం చల్లాలి. స్నానం చేసిన తరువాత, సూర్య భగవానుడికి, కుల దేవతని నమస్కరించి, స్మరించుకుని ఆశీస్సులు పొందాలి. ఆ తరువాత, శుభ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని, రాఖీ ప్లేట్ సిద్ధంచేసుకోవాలి.
- రాఖీ ప్లేట్‌లో రాగి లేదా ఇత్తడి ప్లేట్‌లో రాఖీ, అక్షింతలు, కుంకుమ, స్వీట్లు తప్పనిసరిగా ఉంచుకోవాలి.
- రక్షా బంధన్ నాడు ఇంటి దేవతకు రక్షా సూత్రాన్ని అంకితం చేసి, పూజ చేసుకోవాలి.
రాఖీ కట్టేటప్పుడు సోదరుడి ముఖం తూర్పు దిక్కుగా ఉండాలని గుర్తుంచుకోండి.
- సోదరీమణులు ముందుగా సోదరుని నుదిటిపై, ఆపై మణికట్టుపై తిలకం వేయాలి. ఆ తర్వాత రాఖీ కట్టాలి.
- సోదరీమణులు సోదరుడి కుడి చేతికి రాఖీ కట్టాలి.
- ఆ తరువాత, సోదరి, సోదరులు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకోవాలి.