Raksha Bandhan 2023: రాఖీ పండుగ ఎప్పుడు.. శుభ ముహూర్తం ఎప్పుడుందో తెలుసుకోండి..!
Raksha bandhan 2023: హిందువుల అతి ముఖ్యమైన పండుగలలో రాఖీ పండుగ ఒకటి. దీనిని శ్రావణమాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు.
Raksha bandhan 2023: హిందువుల అతి ముఖ్యమైన పండుగలలో రాఖీ పండుగ ఒకటి. దీనిని శ్రావణమాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. సోదరసోదరీమణులు ప్రేమకు ప్రతీకగా ఈ పండుగని నిర్వహిస్తారు. ఈ రోజున సోదరీమణులు సోదరులకి రాఖీ కట్టి వారి దీర్ఘాయుష్షు కోసం దేవుడిని ప్రార్థిస్తారు. వారి ఆశీస్సులు తీసుకుంటారు. రాఖీ కట్టినందుకు సోదరులు వారికి బహుమతులు అందిస్తారు. అయితే రాఖీ ఎప్పుడైనా శుభ ముహూర్తంలో కట్టాలి. లేదంటే చెడు సంఘటనలు జరుగుతాయి. ఈ సంవత్సరం రాఖీ ఏ సమయంలో కట్టాలో ఈరోజు తెలుసుకుందాం.
ఈ సంవత్సరం పౌర్ణమి ఆగస్టు 30, ఉదయం 10:59 గంటలకు ప్రారంభమై ఆగస్టు 31న ఉదయం 07:06 గంటలకు ముగుస్తుంది. ఆగస్టు 30న ఉదయం 10.58 గంటల నుంచి రాత్రి 09.01 గంటల వరకు భద్ర కాలం ఉంటుంది.. ఈ సమయంలో రాఖీ కట్టకూడదు. అయితే రాఖీ కట్టడానికి శుభ సమయం ఆగస్టు 30వ తేదీ రాత్రి 09:02 నుంచి ఆగస్టు 31వ తేదీ ఉదయం 07:06 గంటల వరకు ఉంది. ఈ సమయంలో మాత్రమే రాఖీ కట్టాలి. అయితే రాఖీని ఆగస్టు 30, 31 రెండు రోజుల్లో రెండు రోజుల్లో కట్టవచ్చు. కానీ శుభ ముహూర్తంలో మాత్రమే కట్టాలని గుర్తుంచుకోండి.
భద్ర కాలం మంచిది కాదు
హిందు మతంలో భద్ర సమయం అనేది అశుభంగా భావిస్తారు. ఈ సమయంలో రాఖీ కట్టడం, పూజలు చేయడం, కొత్త పనులు ప్రారంభించడం, గృహ ప్రవేశాలు చేయడం మంచిది కాదు. ఒకవేళ చేస్తే అశుభ ఫలితాలు పొందుతారు. వాస్తవానికి రావణుడి చెల్లెలు శూర్పణఖ భద్రకాలంలో రాఖీ కట్టడం వల్లే హతమవుతాడు. అందుకే భద్రకాలం మంచిదికాదని చెబుతారు. ఎవ్వరైనా మంచి పని మంచి సమయంలో చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.