Krishnashtami 2023: కృష్ణాష్టమి రోజు ఇలా చేయండి.. కృష్ణ పరమాత్ముని అనుగ్రహం పొందండి..!

Krishnashtami 2023: సెప్టెంబర్‌ 7వ తేదీన కృష్ణాష్టమి వస్తుంది. శ్రావణ మాస కృష్ణ పక్ష అష్టమి రోజున దేవకీ వసుదేవులకి శ్రీ కృష్ణుడు జన్మిస్తాడు.

Update: 2023-09-06 06:06 GMT

Krishnashtami 2023: కృష్ణాష్టమి రోజు ఇలా చేయండి.. కృష్ణ పరమాత్ముని అనుగ్రహం పొందండి..!

Krishnashtami 2023: సెప్టెంబర్‌ 7వ తేదీన కృష్ణాష్టమి వస్తుంది. శ్రావణ మాస కృష్ణ పక్ష అష్టమి రోజున దేవకీ వసుదేవులకి శ్రీ కృష్ణుడు జన్మిస్తాడు. అందుకే ఈ రోజుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. విష్ణువు అవతారాలలో కృష్ణావతారం చాలా ప్రత్యేకమైనది. లోకానికి భగవద్దీత ద్వారా జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఈ రోజున భక్తులు శ్రీ కృష్ణుడిని ఏ విధంగా ఆరాధించాలి.. ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు తదితర విషయాల గురించి తెలుసుకుందాం.

'అర్జునా.. ధర్మమునకు హాని కలిగినప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను. ఏదో ఒక రూపముతో లోకమున అవతరిస్తాను' అని శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా ఉపదేశించాడు. కృష్ణుడు మానవునిగా జన్మించి అధర్మంపై ధర్మంగా ఎలా విజయాన్ని అందించాడో కృష్ణావతారం రోజున ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీనివల్ల జ్ఞానంతో పాటు ఆ పరమాత్ముడి అనుగ్రహం కూడా లభిస్తుంది. మహాభారతం ద్వారా మానవులు ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో పూర్తిగా తెలియజేశాడు. అందుకే ప్రతి ప్రశ్నకి భారతంలో సమాధానం లభిస్తుంది.

కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానము చేసి మడి బట్టలు ధరించాలి. ఇంటిని పూజా మందిరమును శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు పూజా మందిరములో ముగ్గులు వేయాలి. పగలంతా ఉపవాసం ఉండి సాయం కాలం శ్రీ కృష్ణుని పూజించాలి. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా పెట్టాలి. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడాలి. వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి కొట్టాలి. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' అని కూడా పిలుస్తారు. కృష్ణాష్టమి రోజున కృష్ణుని స్మరించుకుంటూ కృష్ణుడు అందించినటువంటి గీతను, భారతాన్ని వింటూ చదువుతూ ఎవరైతే గడుపుతారో వారికి కృష్ణ భగవానుని అనుగ్రహం కలుగుతుంది.

Tags:    

Similar News