Eating Rules: శాస్త్రం ప్రకారం భోజన పద్ధతులు.. ఆకులో తినాలా.. ప్లేట్‌లో తినాలా..?

Eating Rules: కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు.. పట్టడన్నం కోసమే అందరు పనిచేసేది.

Update: 2023-09-05 14:30 GMT

Eating Rules: శాస్త్రం ప్రకారం భోజన పద్ధతులు.. ఆకులో తినాలా.. ప్లేట్‌లో తినాలా..?

Eating Rules: కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు.. పట్టడన్నం కోసమే అందరు పనిచేసేది. అలాంటి అన్నం తినేటప్పుడు శాస్త్ర ప్రకారం కొన్ని పద్దతులు పాటించాలి. అప్పుడే ఆ అన్నానికి విలువ దాని తిన్నందుకు సార్ధకత ఏర్పడుతుంది. ఈ విషయాన్ని చాలామంది పట్టించుకోరు అందుకే ఎప్పుడు దరిద్రములో బతుకుతారు. శాస్త్రం ప్రకారం భోజనం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

శాస్త్రం ప్రకారం వడ్డించిన విస్తరి/పళ్లెం ముందు ఎప్పుడు కూర్చొవద్దు. తినడానికి కూర్చున్న తరువాతే అన్నీ వడ్డించుకుని తినాలి. ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మన కోసం అన్నం ఎదురుచూడరాదు. అలాగే ఒంటరిగా భోజనం చేయకూడదు. వడ్డించడానికి తల్లి గానీ, భార్యగానీ, సంతానం గానీ ఉండాలి. అర్థరాత్రి సమయంలో అన్నం తినడం నిషేధం. ఈ సమయంలో రాక్షసులు భోజనం చేస్తారని చెబుతారు.

అలాగే ఎల్లప్పుడు అరటి ఆకులో భోజనం చేస్తే శరీరానికి చాలా మంచిది. ఒకవేళ అన్నంలో విషం కలిపితే అకు నలుపు రంగుగా మారిపోతుంది. అరటి ఆకులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. సహజ రుచి లభిస్తుంది. పర్యావరణానికి హాని చేయకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి. నేలను సారవంతం చేస్తాయి. అందుకే ప్రాచీన కాలంలో ఇంటికి వచ్చిన అతిథులకి అనుమానం రాకుండా అరిటాకులో భోజనం పెట్టేవారు.

భోజనం ఏ దిక్కున కూర్చుని చేసినా మంచిదే కానీ తూర్పునకు ముఖం పెట్టి చేయడం ఉత్తమం. దీనివల్ల దీర్దాయుష్షు లభిస్తుంది. అన్నము తినేటప్పుడు అన్నాన్ని అలాగే అన్నం పెట్టువారిని తిట్టకూడదు. ఏడుస్తూ తినడం, గిన్నె లేదా ఆకు మొత్తం ఊడ్పుకొని తినడం మంచిది కాదు. ఒడిలో కంచం, పళ్ళెము పెట్టుకుని తినకూడదు. ఇలాంటి పనుల వల్ల దరిద్రం వస్తుంది. చనిపోయాక వారు నరకానికి వెళుతారు.

Tags:    

Similar News