Navratri 2023 Diet: నవరాత్రులు ఈ డైట్‌ పాటిస్తే సులువుగా బరువు తగ్గుతారు..!

Navratri 2023 Diet: సనాతన హిందూ సంప్రదాయం ప్రకారం దేవి శరన్నవరాత్రులకు చాలా ప్రాధాన్యత ఉంది. 9 రోజుల పాటు అమ్మవారిని తొమ్మిది రూపాలలో పూజిస్తారు.

Update: 2023-10-18 14:30 GMT

Navratri 2023 Diet: నవరాత్రులు ఈ డైట్‌ పాటిస్తే సులువుగా బరువు తగ్గుతారు..!

Navratri 2023 Diet: సనాతన హిందూ సంప్రదాయం ప్రకారం దేవి శరన్నవరాత్రులకు చాలా ప్రాధాన్యత ఉంది. 9 రోజుల పాటు అమ్మవారిని తొమ్మిది రూపాలలో పూజిస్తారు. ఈ 9 రోజులు ఉపవాసం పాటించడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో పాటు సులువుగా బరువు కూడా తగ్గుతారు. అయితే బరువు తగ్గాలనుకుంటే ఆకలితో ఉండాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సరైన డైట్‌ పాటించడం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

బరువు తగ్గడానికి ఉదయం టిఫిన్‌గా ఉప్మా తింటే సరిపోతుంది. తర్వాత పియర్, బొప్పాయి, యాపిల్ వంటి అధిక ఫైబర్ పండ్లను తినవచ్చు.తరువాత మధ్యాహ్న భోజనంలో ఖిచ్డీని తీసుకోవాలి. ఇక డిన్నర్‌లో పప్పుతో రోటీ తినవచ్చు. నవరాత్రి ఉపవాస సమయంలో ఎలాంటి వేయించిన లేదా కాల్చిన ఆహారాన్ని తినవద్దు. కేవలం ఉడకబెట్టిన కూరగాయలను మాత్రమే తీసుకోవాలి. ఉల్లిగడ్డ, వెల్లుల్లి వంటివారికి దూరంగా ఉండాలి.

చక్కెరకు బదులుగా సహజ చక్కెరను ఉపయోగించాలి. ఆహారంలో అధిక కేలరీల ఆహారాలను చేర్చుకోవచ్చు. ఉపవాస సమయంలో డ్రై ఫ్రూట్స్‌కు బదులుగా సహజసిద్దమైన పండ్లను తింటే తక్షణ శక్తి లభిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం గర్భధారణ సమయంలో మహిళలు ఉపవాసం ఉండకూడదు. దీని కారణంగా వారి శరీరం మరింత బలహీనంగా మారుతుంది అంతేకాకుండా దీని వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది.

Tags:    

Similar News