Eid-ul-Fitr 2020: చంద్ర దర్శనం కాకపోవడంతో 24 వతేదీ రంజాన్ పండుగ జరుపుకోనున్న సౌదీ అరేబియా
పవిత్రమైన రంజాన్ పండుగను ఈరోజు(మె23) ముస్లిం సోదరులు జరుపుకోవలసి ఉంది. అయితే, 30 రోజుల ఉపవాస దీక్ష తరువాత కావలసిన చంద్రుని దర్శనం ఈరోజు కాకపోవడంతో రంజాన్ పండుగను రేపు అంటే మే 24 వ తేదీన జరుపుకోవాలని ముస్లిం సోదరులకు సౌదీ అరేబియాకు చెందిన ఉన్నత న్యాయ వ్యవస్థ ప్రకటించింది. ఈద్-ఉల్-ఫితర్ అదేవిధంగా షవ్వాల్ మొదటి రోజు ఉత్సవాలను ఎప్పుడు జరుపుకోవాలనే అంశాలను ఈరోజు (మే 23) చంద్ర దర్శన కమిటీ చంద్రుని చూసిన వెంటనే వెల్లడిస్తారు. కరోనా వైరస్ ఇబ్బంది కారణంగా ఈ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అవుతోంది.
Reports of negative sighting in #Sudair. News regarding other regions to follow soon. In sha Allah#Ramadan #EidAlFitr
— 𝗛𝗮𝗿𝗮𝗺𝗮𝗶𝗻 (@HaramainInfo) May 22, 2020
ఈద్-ఉల్-ఫితర్ అనేది పవిత్ర రంజాన్ మాస ఉపవాస ముగింపు రోజుగా ముస్లిం సోదరులు ప్రపంవ్హ వ్యాప్తంగా నిర్వహించుకుంటారు. ఇస్లామిక్ క్యాలెండర్ చంద్రుని కదలికలకు అనుగుణంగా ఏర్పాటయి ఉన్నాయి. ఒక నెలకు 29 లేదా 30 రోజులు ఉంటాయి. కొత్తగా చంద్రుడు కనబడిన రోజును కొత్త నెల మొదటి రోజుగా పరిగణిస్తారు.
ఈ పద్ధతిలో మే 22 రాత్రి చంద్రుడు కనిపించకపోవడంతో సౌదీ అరేబియాలో ఆదివారం (మే 24) ఈద్-ఉల్-ఫితర్ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సౌదీ అరేబియాకు చెందిన ముస్లిం సోదరులు ఈద్-ఉల్-ఫితర్ పండుగ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ పవిత్ర రంజాన్ మాసం అంతా వారు ఉపవాస్ దీక్షను పాటించారు. ప్రతి ముస్లిం సోదరుడు ఈ ఉత్సవం కోసం ఎదురుచూస్తున్నారు.
రియాద్మ కు చెందినా మాజ్మ యూనివర్సిటీ ఆస్ట్రానమర్స్ చెబుతున్న దాని ప్రకారం మే 22 వ తేదీన చంద్రుని చూడటానికి అవకాశాలు చాలా తక్కువ. అందుకే, ఈద్ పండుగను సౌదీ అరేబియాలో మే 24 న నిర్వహించనున్నారు.