Daily Horoscope: ఈరోజు మీరోజు! ఆగస్ట్ 26 పంచాంగం, దినఫలాలు!
Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం, 26 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం అష్టమి: (మ. 2-35 వరకు) తదుపరి నవమి, అనూరాధ నక్షత్రం (సా. 5-42 వరకు) తదుపరి జ్యేష్ఠ అమృత ఘడియలు (ఉ. 7-53 నుంచి 9-24 వరకు) వర్జ్యం (రా. 11-02 నుంచి 12-33 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-37 నుంచి 12-27 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-17
ఈరోజు రాశి ఫలాలు
మేషం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఉద్యోగ,వ్యాపారాలలో పురోగతి.
వృషభం: విద్య, ఉద్యోగ.ప్రయత్నాలు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. ఉద్యోగ, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.
మిథునం: పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆస్తి వివాదాలు. ఉద్యోగ, వ్యాపారాలలో చికాకులు. వాహనాలు, గృహం కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు.
కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. ఉద్యోగ, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
సింహం: నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. ఉద్యోగ, వ్యాపారాలలో సమస్యలు తీరతాయి.
కన్య: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన. ఉద్యోగ, వ్యాపారాలలో ఒత్తిడులు తప్పకపోవచ్చు.
తుల: ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. మిత్రులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు.
వృశ్చికం: చేపట్టిన పనులలో పురోగతి. సంఘంలో గౌరవమర్యాదలు. ఆధ్యాత్మిక చింతన. ముఖ్య నిర్ణయాలు. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత.
ధనుస్సు: పనుల్లో కొంత జాప్యం. ఆర్థికంగా ఇబ్బందులు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఉద్యోగ, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆస్తుల వ్యవహారాలు చికాకు పరుస్తాయి. దైవదర్శనాలు.
మకరం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహార విజయం. శుభవార్తలు. నూతన ఉద్యోగయోగం. ఉద్యోగ, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
కుంభం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో స్వల్ప ఆటంకాలు. విద్యార్థులకు నిరుత్సాహం. ఉద్యోగ,వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
మీనం: కొత్త విషయాలు తెలుస్తాయి. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో మరింత అభివృద్ధి కనిపిస్తుంది.