Daily Horoscope: ఈరోజు మీరోజు! ఈ రాశివారికి అందరిలోనూ గౌరవం
Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!
ఈరోజు పంచాంగం
ఈరోజు ఆదివారం | 17 జనవరి, 2021 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయణం | పుష్య మాసం | శుక్ల పక్షం | చవితి ఉ.09-12 వరకు తదుపరి పంచమి | శతభిష నక్షత్రం రా.07-31 వరకు | వర్జ్యం: ప.02-20 నుంచి 04-01 వరకు | అమృత ఘడియలు రా.12-31 నుంచి 02-11 వరకు | దుర్ముహూర్తం: సా.04-12 నుంచి 04-56 వరకు | రాహుకాలం: మ.01-30 నుంచి 03-00 వరకు | సూర్యోదయం: ఉ.6-39| సూర్యాస్తమయం: సా.5-42
ఈరోజు రాశి ఫలాలు
మేషం: ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. బంధువులతో అకారణ వైరం. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు అదనపు పనిభారం.
వృషభం: ఆదాయం అంతగా కనిపించదు. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. దైవదర్శనాలు.
మిథునం: కొత్త పనులు ప్రారంభిస్తారు. అందరిలోనూ గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఉన్నత స్థితి.
కర్కాటకం: రుణదాతల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటిలో వివాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు బదిలీ సూచనలు.
సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆశించిన రాబడి కనిపిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో శుభవార్తలు.
కన్య: అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యభంగం. భూ వివాదాలు నెలకొంటాయి. రాబడి కొంత మందగిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతి.
తుల: కొత్త పనులు చేపడతారు. మిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు కైవసం చేసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు.
వృశ్చికం: ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. భూములు కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు.
ధనుస్సు: కుటుంబ సమస్యలు. దూరప్రయాణాలు. స్నేహితులతో విభేదాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలలో లాభాలు కష్టమే. ఉద్యోగాలలో మార్పులు.
మకరం: కొన్ని పనుల్లో అవాంతరాలు. ఆస్తి విషయాలలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో ఒత్తిడులు.
కుంభం: నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. మిత్రుల కలయిక. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు.
మీనం: ఉద్యోగయత్నాలలో విజయం. వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలలో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు.