Daily Horoscope: ఈరోజు మీరోజు! నవంబర్ 15 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

Update: 2020-11-15 00:16 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం | 15 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | అమావాస్య ఉ.11-24 తదుపరి శుక్లపక్ష పాడ్యమి | విశాఖ నక్షత్రం రా.7-11 తదుపరి | వర్జ్యం రా.10-56 నుంచి 12-25 వరకు | అమృత ఘడియలు రా.10-58 నుంచి 12-28 వరకు | దుర్ముహూర్తం సా.3-51 నుంచి 4-36 వరకు | రాహుకాలం సా.4-30 నుంచి 6-00 వరకు | సూర్యోదయం: ఉ.06-08 | సూర్యాస్తమయం: సా.05-21

ఈరోజు రాశి ఫలాలు

మేషం: ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ప్రత్యర్థుల నుంచి సహాయం అందుతుంది.ఆస్తి వివాదాలు తీరి లాభపడతారు. వ్యాపారాలలో అనుకూలం. ఉద్యోగులకు పైస్థాయి నుంచి అభినందనలు.

వృషభం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.

మిథునం: నూతన ఉద్యోగావకాశాలు.. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి.

కర్కాటకం: ఆర్థిక విషయాలు కొంత గందరగోళం. బంధువర్గంతో చర్చలు. శ్రమ పెరుగుతుంది. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాల్లో ఒత్తిడులు.

సింహం: అంచనాలు నిజమవుతాయి. యత్నకార్యసిద్ధి. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

కన్య: భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. చర్చలు ఫలిస్తాయి. సంఘంలోగౌరవమర్యాదలు పొందుతారు. పనుల్లో విజయం. ఆకస్మిక ధనలబ్ధి.వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కుతాయి.

తుల: వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో విరోధాలు. ముఖ్యమైన పనులు మందగిస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. కళాకారులకు చికాకులు.

వృశ్చికం: చేపట్టిన పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. రుణదాతల ఒత్తిడులు. బంధువర్గంతో మాటపట్టింపులు. వ్యాపారాలలో వివాదాలు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

ధనుస్సు: నూతన ఉద్యోగయోగం. కొన్ని పనులలో విజయం. ధార్మికకార్యక్రమాలపై ఆసక్తి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు.

మకరం: కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆప్తుల నుంచి సలహాలు అందుకుంటారు. యత్నకార్యసిద్ది. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కుంభం: రుణయత్నాలు సాగిస్తారు. ఆప్తులతో వివాదాలు. ముఖ్యమైన పనుల్లో అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు.

మీనం: చేపట్టిన పనులు ముందుకు సాగవు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

Tags:    

Similar News