Dont Donate Things: పొరపాటున కూడా ఈ వస్తువులు ఎప్పుడు దానం చేయవద్దు.. అవేంటంటే..?

Dont Donate Things: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రకాల దానాలు చాలా మంచివి.

Update: 2023-08-20 15:30 GMT

Dont Donate Things: పొరపాటున కూడా ఈ వస్తువులు ఎప్పుడు దానం చేయవద్దు.. అవేంటంటే..?

Dont Donate Things: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రకాల దానాలు చాలా మంచివి. ఇవి చేయడం వల్ల జీవితంలో ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుంటారు. ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళుతారు. అలాగే కొన్ని రకాల దానాలు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. సంపాదించిన డబ్బు మొత్తం కోల్పోయి ఆర్థికంగా బాగా చితికిపోతారు. అందుకే శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులని ఎప్పుడు దానం చేయకూడదు. వీటివల్ల ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఎలాంటి వస్తువులు దానం చేయకూడదో ఈరోజు తెలుసుకుందాం.

చీపురు

ఇళ్లు ఊడ్చుకునే చీపురుని ఎప్పుడు దానం చేయకూడదని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు. ఇలా చేయడం వల్ల లక్ష్మిదేవికి కోపం వచ్చి ఇల్లు వదిలి వెళ్లిపోతుందని నమ్మకం. దీని వల్ల ఇంట్లో పేదరికం ఏర్పడుతుంది.

లక్ష్మీదేవి విగ్రహం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎప్పుడు దానం చేయకూడదు. చాలా మంది వెండి నాణేలు, విగ్రహాలు బహుమతులుగా అందిస్తారు. అయితే ఇది మంచిది కాదు. దీనివల్ల తల్లి లక్ష్మికి చాలా కోపం వస్తుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. దీంతో మీ వద్ద డబ్బు నిలవదు.

కొత్త బట్టలు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొంతమంది కొత్త బట్టలు దానం చేయకూడదు. దీని వల్ల మనిషి ఎప్పుడూ దుఃఖంతో ఉంటాడు. ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితులని ఎదుర్కొంటాడు.

మత గ్రంథాలు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మత గ్రంథాలని ఎప్పుడు దానం చేయవద్దు. ఎందుకంటే మతం పట్ల ఆసక్తి లేని వ్యక్తికి పుస్తకాన్ని ఇస్తున్నట్లయితే వారు పుణ్యానికి బదులుగా పాపంలో భాగమవుతారు.

ప్లాస్టిక్ స్టీల్ గాజు పాత్రలు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్లాస్టిక్, స్టీల్, గాజు, అల్యూమినియం పాత్రలను దానం చేయకూడదు. దీనిని అశుభంగా భావిస్తారు. ఇంట్లో డబ్బు నిలవదు.

మిగిలిపోయిన ఆహారం

ఇంట్లో మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ దానం చేయవద్దు. ఇది దానంగా చెప్పబడదు. మీరు తినే ఆహారాన్ని ఆకలితో ఉన్నవారికి పెట్టినప్పుడు పుణ్యం లభిస్తుంది. అంతేకాని రాత్రి పాడై పోయిన ఆహారాలని వద్దనుకొని ఇతరులకి పెట్టడం ధర్మం కాదు. ఇలాంటి వారి ఇంట్లో తల్లి లక్ష్మి ఎక్కువ రోజులు ఉండదు.

Tags:    

Similar News