Railway Track Facts: రైల్వే ట్రాక్‌ల పక్కన బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా.. ఆసక్తికర విషయాలు మీకోసం..!

Railway Facts of India: దేశమంతటా విస్తరించి ఉన్న భారతీయ రైల్వేలు దేశానికి జీవనాధారంగా పేరుగాంచాయి. రైల్వేల నెట్‌వర్క్ చాలా విస్తృతంగా ఉన్న ప్రపంచంలోని కొన్ని దేశాలలో భారతదేశం ఒకటిగా నిలిచింది. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు రైల్వేను సద్వినియోగం చేసుకుంటున్నారు.

Update: 2023-06-25 15:30 GMT

Railway Track Facts: రైల్వే ట్రాక్‌ల పక్కన బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా.. ఆసక్తికర విషయాలు మీకోసం..!

Railway Facts of India: దేశమంతటా విస్తరించి ఉన్న భారతీయ రైల్వేలు దేశానికి జీవనాధారంగా పేరుగాంచాయి. రైల్వేల నెట్‌వర్క్ చాలా విస్తృతంగా ఉన్న ప్రపంచంలోని కొన్ని దేశాలలో భారతదేశం ఒకటిగా నిలిచింది. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు రైల్వేను సద్వినియోగం చేసుకుంటున్నారు. రైల్వేల వల్ల దేశంలోని ఏ మూలకు అయినా చేరుకోవడం చాలా సులువుగా మారింది. అయితే రైల్వేకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇక్కడ రైల్వే ట్రాక్‌కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాలు ఈరోజు తెలుసుకుందాం..

ట్రాక్ పక్కన బాక్స్‌లు ఎందుకు ఉంటాయి?

రైల్వే ట్రాక్‌కి కొంత దూరంలో బాక్స్‌లను ఉంచడం మీరు చాలాసార్లు చూసి ఉంటారు. ఈ పెట్టెను ఎక్సెల్ కౌంటర్ బాక్స్ అంటారు. రైలు ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు, దాని మొత్తం సమాచారం బాక్స్‌లో నమోదు చేయబడుతుంది. దీన్ని బట్టి రైలు వేగం, దిశ ఈజీగా తెలిసిపోతుంది.

రైలు ట్రాక్‌లను ఎలా మారుస్తుంది?

రైలు ఒక ట్రాక్‌పై నడుస్తున్నప్పుడు మరో ట్రాక్‌కి ఎలా చేరుకుంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దాని రెండు చివరలకు సాంకేతికంగా స్విచ్ అని పేరు పెట్టారు. ఇందులో ఎడమ స్విచ్, కుడి స్విచ్ ఉంటాయి. దీంతో రైలు తన రూట్‌ను మార్చుకుంటుంది.

ట్రాక్‌ల మధ్య దూరం..

రైలు పట్టాలు వేసినప్పుడు వాటి మధ్య నిర్ణీత దూరం ఉంటుంది. ప్రపంచంలోని 60 శాతం రైల్వే ట్రాక్‌ల దూరం 4 అడుగుల 8.5 అంగుళాలు. భారతదేశంలో కూడా అదే స్థాయిని అనుసరిస్తుంటారు. అదే సమయంలో, ట్రాక్‌లో వాడే ఇనుపు ముక్కల పొడవు సుమారు 13 మీటర్లు. కేవలం 1 మీటర్ రైలు ట్రాక్ వేసేందుకు వాడే మెటీరియల్ బరువు దాదాపు 50-60 కిలోలకు సమానంగా ఉంటుంది.

Tags:    

Similar News