Railway Track: రైల్వే ట్రాక్‌పై రాళ్లు ఎందుకు చెల్లాచెదురుగా ఉంటాయి.. అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారంతే?
Indian Railways Interesting Facts: మీరు రైళ్లలో చాలాసార్లు ప్రయాణించే ఉంటారు. ఈ ప్రయాణంలో రైలు ట్రాక్‌పై రాళ్లు పడి ఉండటాన్ని మనంచూస్తే ఉంటాం.
Reason for Stone on Railway Track: మీరు రైళ్లలో చాలాసార్లు ప్రయాణించే ఉంటారు. ఈ ప్రయాణంలో రైలు ట్రాక్‌పై రాళ్లు పడి ఉండటాన్ని మనంచూస్తే ఉంటాం. అన్నింటికంటే, ఈ రాళ్లకు రైలు ఆపరేషన్‌కు సంబంధం ఏమిటి? మీరు ఎప్పుడైనా దీనిపై దృష్టి పెట్టారా? రైలు పట్టాలపై ఉన్న రాళ్లకు, రైళ్లకు ఏం సంబంధమో ఇప్పుడు తెలుసుకుందాం..
రైల్వే ట్రాక్‌పై రాళ్లు..
రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాక్‌పై రైలు అతివేగంతో వెళ్తున్నప్పుడు, అది చాలా శబ్దంతోపాటు కంపనాన్ని కలిగిస్తుంది. ఈ కంపనం-శబ్దాన్ని తగ్గించడానికి, ట్రాక్‌పై రాళ్లు చెల్లాచెదురుగా వేస్తుంటారు. ఈ రాళ్లను బ్యాలస్ట్ అని కూడా అంటారు. ఈ రాళ్లు శబ్దం, కంపనాలను గ్రహిస్తాయి. తద్వారా రైలులో కూర్చున్న వ్యక్తులు, బయట నిలబడి ఉన్నవారు ఇబ్బందుల నుండి సేఫ్‌గా ఉంటారు.
ట్రాక్‌పై వ్యర్థాలను పీల్చుకోవడానికి..
పెద్ద రైల్వేస్టేషన్లలో రైలు ఎక్కువ సేపు ఆగినప్పుడు అందులో కూర్చున్న వారు టాయిలెట్‌ను వినియోగించడం వల్ల కింద ఉన్న ట్రాక్‌పై ఆ వేస్ట్ పడుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రాక్‌పై పడిన రాళ్లు ఆ వేస్ట్‌ను పీల్చుకుంటాయి. ఆ రాళ్లు ట్రాక్‌పై లేకుంటే అక్కడే ఈ వేస్ట్ అంతా పేరుకపోయి.. ప్రజాలు ఒక్క నిముషం కూడా అక్కడ ఉండలేరు. ఒక్క నిమిషం కూడా నిల్చోవడానికి జనాలకు ఇబ్బందిగా ఉంటుంది.
ట్రాకులపై పొదలు పెరగకుండా..
రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ట్రాక్‌లను ట్రాక్‌పై ఉంచడానికి కాంక్రీట్‌తో చేసిన స్లీపర్‌లను అమర్చుతుంటారు. ట్రాక్‌పై విసిరిన రాళ్లు ఆ స్లీపర్‌లు వ్యాప్తి చెందకుండా నిరోధిస్తాయి. ఇది చేయకపోతే, రైలు పట్టాలు తప్పే ఛాన్స్ ఉంటుంది. దాని కారణంగా పెద్ద ప్రమాదం జరగవచ్చు. ఈ రాళ్లు ట్రాక్‌ని మట్టితో మునిగిపోకుండా నిరోధిస్తాయి. అలాగే ట్రాక్‌పై పొదలు పెరగకుండా నిరోధిస్తాయి.