Viral Video: దీపావళి వేళ వింత ఆచారం.. ఆవులతో తొక్కించుకునే సంప్రదాయం, ఎక్కడో తెలుసా?

Update: 2024-11-02 11:56 GMT

Diwali celebrations in Madhya Pradesh: దీపావళి వేడుకలు ముగిశాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రజలు అంగరంగవైభవంగా వేడుకులను నిర్వహించుకున్నారు. కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో దీపావళి వేడుకలు జరిగాయి. అమెరికాలో అక్కడి ప్రభుత్వం ఏకంగా స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించింది. ఇదిలావుంటే మన దేశంలో దీపావళి వేడుకల్లోనూ కొన్ని చోట్ల వింత వింత ఆచారాలు అమలులో ఉన్నాయి. అలాంటి ఒక వింత ఆచారం గురించే ఇప్పుడు మనం చూడబోతున్నాం.

ఆయా రాష్ట్రాల ప్రజలు వారి వారి ఆచారాలకు అనుగుణంగా దీపావళి వేడుకలను నిర్వహిస్తారు. సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. దీపావళి పండుగ రోజు లక్ష్మీ పూజలు నిర్వహిస్తుంటాం. నోములు చేసుకునే వారు నోములు చేసుకుంటారు. ఇక స్వీట్స్‌ పంచుకొని ఎంచక్కా పటాకులు కాల్చి దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటుంటాం. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశం నలుమూలలా ఎక్కువగా ఇలాంటి సంప్రదాయమే కనిపిస్తుంది. కానీ మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో మాత్రం ఓ వింత ఆచారం అమలులో ఉంది.

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా భిదద్వాడ్‌ గ్రామంలో దీపావళి వేడుకల సందర్భంగా ఆవులతో తొక్కించుకునే సంప్రదాయం ఉంది. దీపావళి పండుగ మరుసటి రోజు జరిగే గోవర్ధన పూజ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. ఈ సందర్భంగా ఆ గ్రామానికి చెందిన యువకులు ఆవులతో తొక్కించుకుంటారు. వీధిలో యువకులు బోర్లా పడుకుంటారు. ఆ తర్వాత ఆవుల మందను వారి పై నుంచి తీసుకెళ్తారు. ఇలా ఆవులతో తొక్కించుకోవడం ద్వారా మంచి జరుగుతుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తుంటారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ఆ వీడియోను ఎక్స్ (ట్విటర్) ద్వారా నెటిజెన్స్‌తో పంచుకుంది.

Tags:    

Similar News