Viral Video: ఇలాంటి దారుణాలు ఇంకెన్ని చూడాలో.. ఈ వీడియో చూస్తే మీరూ ఇదే అంటారు..!

Viral Video: ఏమంటూ సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిందో ప్రతీ ఒక్కరూ జనాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Update: 2024-10-30 06:20 GMT

Viral Video: ఇలాంటి దారుణాలు ఇంకెన్ని చూడాలో.. ఈ వీడియో చూస్తే మీరూ ఇదే అంటారు..!

Viral Video: ఏమంటూ సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిందో ప్రతీ ఒక్కరూ జనాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏది చేసైనా సరే నెట్టింట ట్రెండ్‌ అవ్వాలనుకుంటున్నారు. లైక్స్‌, కామెంట్స్‌ కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. కొందరు ప్రాణాలకు తెగిస్తుంటే, మరికొందరు పిచ్చి పిచ్చి పనులతో వైరల్‌ అవ్వాలని చూస్తున్నారు. ఇందుకోసం కొందరు చిత్రవిచిత్ర పనులు చేస్తున్నారు. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో చూస్తుంటే ఇలాంటి దారుణాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

ఓ కుర్రాడు వినూత్నమైన రీతిలో డ్రస్‌ను ధరించాడు. అరటి ఆకులతో పాటు కొన్ని మొక్కలను డ్రస్‌లా ధరించి రచ్చ చేశాడు. ఆకులను శరీరానికి చుట్టుకుని వెరైటీ వస్త్రధారణలో డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. చేతులకు అరటి ఆకులను రెక్కల్లా మార్చాడు, అలాగే కొబ్బరి మట్టలను వెనుక తోకలా తగిలించుకున్నాడు. కాళ్లకు కర్రలతో చేసిన చెప్పులు వేసుకున్నాడు.

ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోకు కోట్లలో వ్యూస్‌ వస్తున్నాయి. ఇక వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ ఉర్ఫీ జావేద్‌ ఇలా వెరైటీ డ్రస్‌లు ధరిస్తూ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుందనే విషయం తెలిసిందే. ఇప్పుడీ కుర్రాడు ఉర్ఫీకే పోటీనిచ్చేలా ఉన్నాడంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు కామెంట్స్ చేస్తూ.. పిచ్చి పీక్స్‌కి చేరడం అంటే ఇదనంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.


Tags:    

Similar News