Viral Video: రీల్స్ కోసం రివర్స్ డ్రైవింగ్ చేద్దామనుకున్నాడు.. చివరికి ఏమైందో చూడండి..
Viral Video: తాజాగా ఓ ప్రబుద్ధుడు ఇలాగే వెరైటీ పని చేసి సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశాడు.
Viral Video: సోషల్ మీడియాలో ఎలాగైనా వైరల్ అవ్వాలి, నలుగురు దృష్టిని ఆకర్షించాలి. ఇప్పుడు చాలా మంది ఆలోచన ఇలాగే ఉంటుంది. రీల్స్ కోసం ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు కొందరు. అందరు చేసింది చేస్తే వ్యూస్ రావనే ఉద్దేశంతో రకరకాల ఫీట్స్ చేస్తున్నారు. దీంతో ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే తమ ప్రాణాలను మీదికి తెచ్చుకుంటూ తీస్తున్న ఈ వీడియోలు చూసే వారికి మాత్రం నవ్వులు తెప్పిస్తాయి.
తాజాగా ఓ ప్రబుద్ధుడు ఇలాగే వెరైటీ పని చేసి సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశాడు. ఇంకేముంది దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అందరిలా కాకుండా వినూత్నంగా బైక్ డ్రైవ్ చేయాలని అనుకున్నాడు. బైక్‌పై రివర్స్‌లో కూర్చొని నడిపేందుకు ప్రయత్నించాడు. బైక్ సీటుపై రివర్స్‌లో కూర్చొని ఎంచక్కా హ్యాండిల్‌ను పట్టుకున్నాడు. క్లచ్ నొక్కి గేర్ కూడా మార్చాడు.
తర్వాత నెమ్మదిగా క్లచ్‌ను వదిలి యాగ్జలేటర్‌ను ఇచ్చాడు. దీంతో బైక్ ముందుకు కదలడం ప్రారంభమైంది. అయితే కాస్త దూరం బాగానే వెళ్లిన బైక్ ఆ తర్వాత ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయింది. దీంతో ధబేల్‌మని కిందపడిపోయాడు. వ్యూస్ కోసం రీల్ చేస్తూ ఇలా బోల్తా పడ్డాడు. అయితే కింద పడ్డా వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల స్పందిస్తున్నారు. వ్యూస్ కోసం ఈ సర్కాస్ ఫీట్లు అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ వ్యక్తి మాత్రం ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డాడు.