Optical illusion: మీ కంటి చూపు టెస్ట్ చేసుకోండిలా.. ఇందులో పిల్లిని కనిపెట్టండి చూద్దాం
Optical illusion: సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలకు డిమాండ్ పెరుగుతోంది. వీటిలో మెదడుకు మేత పెట్టేవి కొన్నైతే.. కంటి చూపును పరీక్షించేవి మరికొన్ని. ఇలాంటి పజిల్స్‌ను సాల్వ్ చేయడంలో భలే కిక్కు ఉంటుంది. అందుకే ఇలాంటి ఫోటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫోటో నెటిజన్లను కన్ఫ్యూజ్ చేస్తోంది. ఇంతకీ ఏంటా ఫొటో.? అందులో ఉన్న మ్యాజిక్ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే చెట్లు కనిపిస్తున్నాయి కదూ! అయితే ఈ ఫొటోలోనే ఒక పిల్లి దాగి ఉంది. దానిని కనిపెట్టడమే ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో ముఖ్య ఉద్దేశం. ముందుగా ఆ పిల్లి ఎక్కడుందో మీ కంటికి కనిపిస్తుందేమో ట్రై చేసి చూడండి. పిల్లిని 10 సెకండ్లలో కనిపెడితే మీ ఐపర్ పవర్ సూపర్ అని అర్థం. మరెందుకు ఆలస్యం ఆ పిల్లిని కనిపెట్టగలరేమో ట్రై చేయండి. అప్పటికి దొరక్కపోతే అప్పుడు ఈ హింట్ మీకోసమే.
ఈ ఫోటోలో ఒక పిల్లి చెట్ల మాటున ఉండి నక్కి నక్కి చూస్తోంది. ఏంటి ఎంత ప్రయత్నించినా పిల్లిని కనిపెట్టలేకపోతున్నారా.? నల్లగా ఉన్న ఆ పిల్లి కళ్లు మాత్రం మెరుస్తూ కనిపిస్తున్నాయి. దాని ఆధారంగానే మీరు పిల్లిని గుర్తించగలరు. మరోసారి ప్రయత్నించి చూడండి ఆ పిల్లి జాడ ఇట్టే కనిపిస్తుంది. ఏంటి.. ఎంత ప్రయత్నించినా పిల్లిని కనిపెట్టలేకపోతున్నారా.? అయితే ఓసారి ఫొటోలో ఎడమ వైపు తీక్షణంగా గమనించండి. ఆకుల నడుమ ఉన్న పిల్లి ఇట్టే కనిపిస్తుంది. ఇన్నీ క్లూలు ఇచ్చినా కనిపెట్టలేకపోతే సమాధానం కోసం ఓసారి కింద ఉన్న ఫొటో చూసేయండి.