Confirm Train Ticket: పండుగ సీజన్.. ఇలా చేస్తే ట్రైన్ టికెట్ కన్ఫర్మ్!
Conform train ticket: ఐఆర్‌సీటీసీ వికల్ప్ స్కీమ్‌లో (IRCTC Vikalp Scheme) మీ టిక్కెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలను పెంచుకోవచ్చు.
Confirm Train Ticket: దీపావళి పండుగ సమీపిస్తున్న కొద్దీ ప్రజలు ఇంటికి తిరిగి వెళ్ళడానికి టిక్కెట్ల బుకింగ్ కొసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు రైలు టిక్కెట్‌ను పొందడం ప్రస్తుతం చాలా కష్టంగా కనిపిస్తోంది. రైల్వేశాఖ అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతున్నప్పటికీ అవి సరిపోవడం లేదు. ఈ క్రమంలో IRCTC వికల్ప్ స్కీమ్ నుంచి కన్ఫార్మ్ రైలు టిక్కెట్‌ను తీసుకోవచ్చు.
ఈ స్కీమ్ గురించి చాలా మందికి తెలియదు. నిజానికి IRCTC మీకు భారతీయ రైల్వేలలో ఆప్షన్ స్కీమ్‌ని ఎంచుకునే అవకాశాన్ని ఇస్తుంది. దీంతో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వారికి కన్ఫర్మ్ టిక్కెట్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా పీక్ సీజన్‌లో ఇది చాలా ఉపయోగకరమైన ఫీచర్.
ఐఆర్‌సీటీసీ Vikalp Schemeలో మీ టిక్కెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలను పెంచుకోవచ్చు. ముఖ్యంగా దీపావళి రోజున ఇంటికి వెళ్లాలనుకునే వారికి ఇది గొప్ప ఆప్షన్. మీరు ఐఆర్‌సీటీసీ నుండి టిక్కెట్‌ను బుక్ చేసినప్పుడు ఆప్షన్ స్కీమ్‌ను ఎంచుకునే ఎంపికను పొందుతారు. దీన్ని ఎంచుకోవడం ద్వారా టికెట్ షెడ్యూల్ 12 గంటలలోపు నడుస్తున్న మరొక రైలుకు మార్తుతుంది, సీటు అందుబాటులో ఉంటే టిక్కెట్ ఆటోమేటిక్‌గా కన్ఫర్మ్ అవుతుంది. అయితే ఒకసారి మరొక రైలుకు టికెట్ ట్రాన్స్‌ఫర్ అయితే ఆ తర్వాత అసలైన రైలు బుకింగ్‌కు తిరిగి రాలేరు.
ఈ ఫీచర్ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆప్షన్ ఎంచుకునే వెయిట్‌లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులు దీని కోసం ఎలాంటి అదనపు ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు. వెయిటింగ్ టిక్కెట్‌ను బుక్ చేస్తున్నప్పుడు మాత్రమే ఈ ప్రాంప్ట్ వస్తుంది. దీన్ని ఎంచుకోండి.
రైలులో కన్ఫర్మ్‌గా మారుతుంటే చార్ట్ సిద్ధమైన తర్వాత మీరు పీఎన్ఆర్ స్టేటస్‌ని చెక్ చేయాలి. సీటు కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు రైలులో ప్రయాణించి ఇంట్లో దీపావళి జరుపుకోవచ్చు.