Viral Video: 42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణం..ఒళ్లు గగ్గుర్పొడిచే వీడియో వైరల్

Update: 2024-12-25 04:01 GMT

Viral Video: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఒళ్లుగగ్గుర్పొడిచే వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. హైవేపై బైక్ ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు మరణించి ఉంటారన్న భయంతో ట్రక్ డ్రైవర్ పట్టుబడకుండా ఉండేందుకు ట్రక్కు వేగాన్ని పెంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే బైక్ నడుపుతున్న ఇద్దరు యువకులు ట్రక్ ముందు ఉన్న బంపర్ లో ఇరుక్కుపోయారు. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ట్రక్కు బంపర్ లో ఇరుక్కుపోయిన ఇద్దరు యువకులు అరుపులు, కేకులు వేయడం స్పష్టంగా కనిపిస్తుంది. వారి బైక్ ను ఢీకొన్నట్రక్ డ్రైవర్ మాత్రం పారిపోయే టెన్షన్ లో అవేవి పట్టించుకోవడం లేదు. కానీ వారికి భూమ్మీద నూకలు ఉన్నాయి కాబట్టి ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారు. అయితే యువకులను గుర్తించిన కొంతమంది వాహనాదారులు ఆ ట్రక్కును ఓవర్ టెక్ చేసి ఆపేందుకు ప్రయత్నించాయి. అంతేకాదు కొంతమంది తమ కార్లు ట్రక్కు ముందు ఆపారు. దాంతో ట్రక్ డ్రైవర్ బ్రేకులు వేశారు. ఆ యువకులిద్దరినీ బంపర్ లో నుంచి బయటకు తీశారు. అనంతరం ట్రక్కు డ్రైవర్ ను పోలీసులకు అప్పగించారు. యువకులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. ఆదివారం రాత్రి ఆగ్రాలోని చట్టా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు స్థానిక ఎస్పీ తెలిపారు.


Tags:    

Similar News