Viral Video: ట్యాలెంట్ బాగానే ఉంది కానీ.. అదుపు తప్పితే అంతే సంగతులు..!
Viral Video: ఏదైనా చెయ్యాలి, సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలి. ఇదిగో ఇప్పుడు చాలా మంది చేసే పనే ఇది.
Viral Video: ఏదైనా చెయ్యాలి, సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలి. ఇదిగో ఇప్పుడు చాలా మంది చేసే పనే ఇది. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత చాలా మంది ఇలాంటి ఆలోచనతో ఉంటున్నారు. తమ వీడియోలకు లైక్స్, వ్యూస్ ఎక్కువగా రావాలన్న ఉద్దేశంతో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అయినా సరే లైక్స్ మాత్రమే ముఖ్యమని అనే ఫీలింగ్‌లో ఉంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. నలుగురు చేసినట్లు చేస్తే ప్రత్యేకత ఏంటుంది అనుకున్నాడో ఏమో కానీ ఓ వ్యక్తి స్యూటీని విచిత్రంగా నడిపించాడు. స్కూటీపై రివర్స్‌లో కూర్చుని నడిపించాడు. అదేదో గ్రౌండ్‌లో ఎవరు లేని ప్రదేశంలో అనుకునేరు. పెద్ద హైవేపై, వందలాది వాహనాలు రయ్యి రయ్యిమంటూ దూసుకుపోతున్న ఓ హైవేపై స్కూటీని రివర్స్‌లో నడిపించాడు. అది కూడా మంచి వేగంతోనే. దీనంతటినీ అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీంతో ఈ వీడియో క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారింది. రోజుల వ్యవధిలోనే ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. ఇక ఈ వీడియో చూసిన వారు రకరకాలుగా స్పందిస్తున్నారు. వ్యూస్ కోసం ప్రాణాలకు కూడా రిస్క్‌లో పెట్టడం అంటే ఇదేనంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక కేవలం తన ప్రాణాలను మాత్రమే కాకుండా రోడ్డుపై వెళ్తున్న ఇతరుల ప్రాణాలను సైతం ఈ వ్యక్తి రిస్క్‌లో పెట్టాడని, ఇలాంటి వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో మాత్రం తెగ ట్రెండ్ అవుతోంది.