Viral Video: కింగ్ కోబ్రాతో పెంపుడు కుక్కల ఫైట్..చివరికి ఏమైందంటే?

Update: 2024-12-25 03:16 GMT

Viral Video: ఛత్తీస్ గఢ్ లో రెండు పెంపుడు శునకాలు, పాము మధ్య చోటుచేసుకున్న ఘటన ఆసక్తికరంగా మారింది. రెండు పెంపుడు శునకాలు పాము కాటు నుంచి తన యజమానితోపాటు వారి కుటుంబాన్ని కాపాడాయి. పాముతో విపరీతంగా పోరాడి ఓ శునకం ప్రాణాలు విడిచింది. మరో శునకం ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉంది.

ముంగేలిలోని సెండ్రరకపలో నివాసం ఉంటున్న శ్రీకాంత్ గోవర్ధన్ ఇంట్లోకి సోమవారం అర్థరాత్రి కింగ్ కోబ్రా వచ్చింది. ఆ సమయంలో అతని ఇంట్లో ఉన్న రెండు కుక్కలు కింగ్ కోబ్రాతో పోరాడాయి. శ్రీకాంత్ ఇంట్లోకి పామును వెళ్లకుండా అడ్డుకున్నాయి. ఈ క్రమంలో రెండు శునకాలు మొరిగే శబ్దం విని కుటుంబ సభ్యులు నిద్రలేచారు. అప్పటికే ఓ కుక్క చనిపోయింది. మరో శునకం ప్రాణాపాయ స్థితిలోకొట్టుమిట్టాడుతోంది. పక్కనే కింగ్ కోబ్రా కూడా చనిపోయి కనిపించింది. దీంతో ఒక్కసారిగా శ్రీకాంత్ గోవర్ధన్ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. గాయాలతో పడి ఉన్న పెంపుడు కుక్కను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా పాము, కుక్కల మధ్య జరిగిన ఫైట్ శ్రీకాంత్ గోవర్ధన్ ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యింది.


Tags:    

Similar News