Viral News: భక్తులు ఆ నీరు అమృతం అనుకుని తాగుతున్నారు.. కానీ అందులో నిజమెంత?

ఇది శ్రీకృష్ణుని పాదాల నుండి వచ్చిన చరణామృతమని కూడా అందులో పేర్కొ్న్నారు. బృందావన్‌లోని ప్రసిద్ధ బాంకే బిహారీ ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Update: 2024-11-05 06:30 GMT

Viral News: పిచ్చి భక్తులు.. ఆ నీరు అమృతం అనుకుని తాగుతున్నారు.. నిజం తెలిస్తే షాకే..!

Viral News: ఉత్తరప్రదేశ్‌లోని మధురలోని బృందావనంలోని ప్రసిద్ధ దేవాలయం బయటి భాగంలో గోడపై ఏనుగు నోటిని పోలిన ఆకారాన్ని నిర్మించారు. ఇక్కడి నుండి నీరు కారుతున్నట్లు సోషల్ మీడియాలో పలు వీడియోలను గుర్తు తెలియని వ్యక్తులు షేర్ చేశారు. ఇది శ్రీకృష్ణుని పాదాల నుండి వచ్చిన చరణామృతమని అందులో పేర్కొన్నారు. బృందావన్‌లోని ప్రసిద్ధ బాంకే బిహారీ ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవడంతో ప్రజలు కనీసం చుక్క నీరైనా తాగాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఆలయానికి బారులు తీరారు. దాని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. గోడపై రూపొందించిన ఏనుగు ఆకారంలో నుండి నీటి చుక్కలు ఎలా పడుతున్నాయో.. దానిని తాగడానికి ప్రజలు ఎలా క్యూలో నిలబడి చూస్తున్నారో వీడియోలో మీరు చూడవచ్చు.

నిజానికి ఈ వీడియో బాంకే బీహార్ ఆలయానికి చెందినదని అంటున్నారు. గోడపై ఉన్న ఏనుగు విగ్రహం నుండి కారుతున్న నీటిని డజన్ల కొద్దీ మంది భక్తులు తాగుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. కొందరు భక్తులు కప్పుల్లో నీటిని సేకరిస్తే, మరికొందరు అరచేతుల్లో నీటిని తాగుతున్నారు. కొంతమంది తమపై కూడా ఆ నీటి చుక్కలు పోసుకుంటున్నారు.

అయితే, నిజానికి చరణామృతంగా భావించి భక్తులు తాగుతున్నది చరణామృతం కాదని, గుడి లోపల ఏర్పాటు చేసిన ఏసీ నుంచి బయటకు వచ్చే నీటినేనని ప్రచారం జరుగుతోంది. వీడియో తీస్తున్న వ్యక్తి కొందరు భక్తులకు తాగుతున్న నీరు ఏసీ నుంచి వచ్చిన నీళ్లని చెప్పడం కూడా వినవచ్చు. ఆ వ్యక్తి అలా చెబుతున్నప్పటికీ, ప్రజలు నీరు తాగడం మానేయడం లేదు. నీటిని తాగడం, తమపై తాము చల్లుకోవడం కొనసాగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో అంతకంతకూ వైరల్ అవుతోంది. ఇప్పటివరకు సోషల్ మీడియా సైట్ Xలో ఈ వీడియోకు 2.8 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. వీడియోలోని కామెంట్ సెక్షన్‌లో ప్రజలు రకరకాల కామెంట్స్ చేస్తుంటే, కొంత మంది సైంటిఫిక్ నేచర్ కూడా లేదని వాపోయారు.


Tags:    

Similar News