Indian Railway: ట్రైన్స్‌ పగలు కంటే రాత్రి స్పీడ్‌గా వెళ్తాయి.. కారణం ఏంటో తెలుసా..?

Indian Railway: భారతీయ రైల్వే దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. అలాగే అత్యధికంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే సంస్థ.

Update: 2024-03-19 05:53 GMT

Indian Railway: ట్రైన్స్‌ పగలు కంటే రాత్రి స్పీడ్‌గా వెళ్తాయి.. కారణం ఏంటో తెలుసా..?

Indian Railway: భారతీయ రైల్వే దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. అలాగే అత్యధికంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే సంస్థ. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది. ట్రైన్‌లో ప్రయాణం ఇతరవాటితో పోల్చుకుంటే చాలా చౌకగా ఉంటుంది. తక్కువ డబ్బుతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. ప్రతిరోజు కొన్ని లక్షల మందిని గమ్యస్థానాలకు చేరవేస్తుంది. అయితే రైల్వేకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతాం. మీరు ట్రైన్‌ లో వెళుతున్నప్పుడు ఒక విషయాన్ని గమనించే ఉంటారు. ట్రైన్‌ పగలు కంటే రాత్రి ఎక్కువ స్పీడ్‌గా వెళ్తుంది. దీనికి కారణం చాలామందికి తెలియదు. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1. తక్కువ ట్రాఫిక్

పగటితో పోలిస్తే రాత్రి వేళల్లో రైలు పట్టాలపై రద్దీ తక్కువగా ఉంటుంది. పగటిపూట సరుకు రవాణ, ప్యాసింజర్ రైళ్లతో పాటు రైల్వే నిర్వహణ పనులు కూడా జరుగుతాయి. దీని కారణంగా రైళ్ల వేగం మందగిస్తుంది.

2. ఉష్ణోగ్రత

రాత్రి ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. దీని కారణంగా పట్టాలపై రాపిడి తక్కువగా ఉంటుంది. తక్కువ రాపిడి కారణంగా రైళ్లు అధిక వేగంతో నడుస్తాయి.

3. సిగ్నల్

రైళ్లకు వచ్చే సిగ్నళ్లు రాత్రి సమయంలో తగ్గుతాయి. దీని కారణంగా రైళ్లు తరచుగా ఆగాల్సిన అవసరం లేదు. దీనివల్ల రాత్రి వేళల్లో రైళ్లు అధిక వేగంతో నడుస్తాయి.

4. నిర్వహణ

రాత్రి వేళల్లో రైల్వే ట్రాక్‌లపై నిర్వహణ పనులు తక్కువగా జరుగుతాయి. దీంతో రైళ్ల వేగానికి అంతరాయం ఉండదు.

5. జంతువుల ప్రమాదం

రాత్రి వేళల్లో జంతువులు రైలు పట్టాలపైకి వచ్చే అవకాశం తక్కువ. దీని కారణంగా రైళ్లను సడెన్‌గా ఆపాల్సిన అవసరం ఉండదు. ఇది కాకుండా రైళ్ల వేగం ట్రాక్ పరిస్థితి, రైలు రకం, వాతావరణం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

Tags:    

Similar News