Viral Video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.? వైరల్‌ అవుతోన్న వీడియో

Viral Video: మాట్లాడే పక్షుల గురించి మనం వినే ఉంటాం. అయితే రామ చిలుకలు, కొన్ని రకాల జాతులకు చెందిన పక్షులు మాత్రమే ఇలా మాట్లాడుతాయి.

Update: 2025-04-02 12:01 GMT
Viral Video

Viral Video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.? వైరల్‌ అవుతోన్న వీడియో

  • whatsapp icon

Viral Video: మాట్లాడే పక్షుల గురించి మనం వినే ఉంటాం. అయితే రామ చిలుకలు, కొన్ని రకాల జాతులకు చెందిన పక్షులు మాత్రమే ఇలా మాట్లాడుతాయి. అచ్చంగా మనుషుల వాయిస్‌ను మక్కికి మక్కి దించేస్తాయి. అయితే కాకి మనిషిలా మాట్లాడడం ఎప్పుడైనా చూశారా.? వినడానికి వింతగా ఉంది కదూ! అయితే తాజాగా సోషల్‌ మీడియాలో దీనికి సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా షాపూర్ తాలూకాలో గర్గావ్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. గ్రామానికి చెందిన ముకానే అనే వ్యక్తికి మూడేళ్ల క్రితం వర్షాకాలంలో ఓ చిన్న కాకి కనిపించింది. అతను దానిని ఇంటికి తీసుకెళ్లి పెంచుకున్నాడు. కాలక్రమేణా ఆ కాకి మనుషుల్లా అరుస్తూ, కొన్ని పదాలను స్పష్టంగా పలుకుతూ కనిపించిందట. స్థానికుల కథనం ప్రకారం, ‘‘మామ, దాదా’’ అనే పదాలను అది పలుకుతుందని స్థానికులు చెబుతున్నారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న వీడియోలో కాకి చెక్క బల్లపై నిల్చొని ఉంది. ఈ సమయంలో కాకి 'కాకా.. కాకా' అంటూ అరిచినట్లు వినిపిస్తోంది. దీనంతటినీ వీడియోగా తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది. అయితే ఈ వీడియోలో కాకి నిజంగానే మాట్లాడుతుందా.? లేదా బ్యాగ్రౌండ్‌లో వాయిస్‌ మార్చారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది. మరెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.



Tags:    

Similar News