Optical Illusion: ఈ ఫొటోలో ఓ పెద్ద మిస్టేక్ ఉంది.. అదేంటో గుర్తుపట్టగలరా.?
Optical Illusion: ఒకప్పుడు కేవలం మ్యాగజైన్స్‌కు మాత్రమే పరిమితమైన ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలకు ప్రస్తుతం భలే క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరికీ వీటిపై అవగాహన వస్తోంది. ఒకప్పుడు కేవలం మ్యాగజైన్స్‌కు మాత్రమే పరిమితమైన ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ ఇలాంటివి సాల్వ్ చేయడంలో ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వీటికి నెట్టింట క్రేజ్ ఏర్పడుతోంది. ఇక ఆప్టికల్ ఇల్యూజన్స్‌లో ఎన్నో రకాలు ఉన్నాయి. వీటిలో కొన్ని మన కంటి చూపును పరీక్షిస్తే, మరికొన్ని మన ఆలోచన శక్తిని పరీక్షిస్తాయి. అలాంటి ఆలోచన శక్తికి టెస్ట్ పెట్టే ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా ఫొటో.? అందులో ఉన్న మ్యాజిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే నలుగురు మిత్రులు పిజ్జా తింటున్నట్లు కనిపిస్తోంది కదూ. అయితే ఈ ఫొటోలో ఓ మిస్టేక్ ఉంది. అదేంటో గుర్తుపట్టారా.? చాలా తీక్షణంగా చూస్తే కానీ ఆ తప్పును గుర్తించలేదు. అయితే సాధారణంగా చాలా మంది అక్కడ ఉన్న పాల గ్లాసును తప్పుగా భావిస్తుంటారు. పిజ్జా తినేప్పుడు పాలు తాగరు కదా అని మీరు ఉంటుండొచ్చు.
కానీ నిజానికి అంత కంటే పెద్ద తప్పే ఈ ఫొటోలో ఉంది. అదేంటో 30 సెకన్లలో గుర్తిస్తే మీ ఆలోచన సూపర్ అని చెప్పొచ్చు. ఇంతకీ ఆ తప్పు ఏంటో కనిపెట్టారా.? ఎంత ప్రయత్నించినా తప్పును కనిపెట్టలేకపోయారా.? అయితే ఓసారి టేబుల్ మీద ఉన్న పిజ్జాను జాగ్రత్తగా గమనించండి. అదే విధంగా అక్కడ ఎంత మంది చేతుల్లో పిజ్జా ముక్కలు ఉన్నాయో చూడండి. ఇప్పుడు అర్థమైందా.. ఈ ఫొటోలో ఉన్న తప్పెంటో. అవును.. అక్కడ 4 పిజ్జా ముక్కలుంటే, టేబుల్‌పై మాత్రం మూడు ముక్కలు మాత్రమే మిగిలి ఉన్నాయి.