Pan Card Name Change :పాన్‌కార్డులో పేరు తప్పుగా ఉందా.. ఇలా సులువుగా అప్‌డేట్‌ చేసుకోండి..!

Pan Card Name Change Process: ఈ రోజుల్లో ఆర్థిక లావాదేవీలకు పాన్‌కార్డు అనేది చాలా ముఖ్యంగా మారింది.

Update: 2024-02-13 14:30 GMT

Pan Card Name Change Process: ఈ రోజుల్లో ఆర్థిక లావాదేవీలకు పాన్‌కార్డు అనేది చాలా ముఖ్యంగా మారింది. బ్యాంకులో అకౌంట్‌ ఓపెన్‌ నుంచి ఇన్‌కమ్‌టాక్స్‌ ఫైల్‌ చేసేవరకు ప్రతి పనికి పాన్‌కార్డు అవసరమవుతుంది. అయితే చాలామందికి పాన్‌కార్డులోపేరు తప్పుగా నమోదవుతుంది. దీంతో పనులు జరగక తరచుగా ఇబ్బందిపడుతుంటారు. కానీ ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో సులువుగా పాన్‌కార్డులో పేరు మార్చుకోవచ్చు. ఆ ప్రాసెసె గురించి ఈ రోజు తెలుసుకుందాం.

నేమ్‌ అప్‌డేట్‌ ప్రక్రియ

1.మొదట ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

2. "ఆన్‌లైన్ సేవలు" ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.

3. "PAN సేవలు" కింద "PAN కార్డ్ రీప్రింట్/కరెక్షన్/చిరునామా మార్పు కోసం అభ్యర్థన"పై క్లిక్ చేయాలి.

4. "ఆన్‌లైన్‌లో వర్తించు"పై క్లిక్ చేయాలి.

5.ఇప్పుడు మీ పాన్ నంబర్, పుట్టిన తేదీ, లింగాన్ని ఎంటర్‌ చేయాలి.

6. తర్వాత చెక్‌బాక్స్‌పై క్లిక్ చేయాలి.

7. "సమర్పించు" పై క్లిక్ చేయాలి.

8. ఇప్పుడు మీరు కొత్త పేజీని చూస్తారు. అందులో మీ పేరులో దిద్దుబాటు కోసం అవసరమైన సమాచారాన్ని ఎంటర్‌ చేయాలి.

9. ఇందులో పాన్ కార్డ్‌లో తప్పుగా ఉన్న పేరు అలాగే పాన్ కార్డ్‌లో ప్రింట్ చేయాలనుకునే పేరు ఎంటర్‌చేయాలి.

10. మొత్తం సమాచారాన్ని ఎంటర్‌ చేసిన తర్వాత "సమర్పించు"పై క్లిక్ చేయాలి.

11. మీరు అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్‌ని అందుకుంటారు. భవిష్యత్ సూచన మేరకు ఈ రసీదు సంఖ్య అవసరం అవుతంది. కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి.

12. మీ పేరు మార్పు అభ్యర్థన ఆమోదించడానికి 15 నుంచి 20 రోజులు పడుతుంది. తర్వాత సరైన పేరు ముద్రించిన కొత్త పాన్‌కార్డ్‌ని అందుకుంటారు.

13. ఒకవేళ మీ పేరు మార్పు అభ్యర్థన ఆమోదించకపోతే మీరు షోకాజ్ నోటీసు అందుకుంటారు. ఈ నోటీసు మీ పేరు మార్పు అభ్యర్థనను తిరస్కరించడానికి గల కారణాలను తెలియజేస్తుంది. మీరు ఈ కారణాలతో ఏకీభవించకపోతే వాటిని కోర్టులో అప్పీల్ చేయవచ్చు.

Tags:    

Similar News