Mother's Day 2023: ఈ ఏడాది మదర్స్ డే ఎప్పుడు? అసలు ఇది ఎలా మొదలైంది.. ప్రాముఖ్యత ఏంటి?

Mother's Day History and Significance: ప్రతి సంవత్సరం మదర్స్ డేని ఘనంగా సెలబ్రేట్ చేస్తుంటారు. ఇక ఈ ఏడాది 2023లో మే నెల రెండవ ఆదివారం నాడు నిర్వహించనున్నారు.

Update: 2023-05-10 06:12 GMT

Mother's Day 2023: ఈ ఏడాది మదర్స్ డే ఎప్పుడు? అసలు ఇది ఎలా మొదలైంది.. ప్రాముఖ్యత ఏంటి?

Mothers Day 2023: ప్రతి సంవత్సరం మదర్స్ డేని ఘనంగా సెలబ్రేట్ చేస్తుంటారు. ఇక ఈ ఏడాది 2023లో మే నెల రెండవ ఆదివారం నాడు నిర్వహించనున్నారు. చాలా మంది ప్రజలు ఈ సంవత్సరం మాతృదినోత్సవం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మే 14న మదర్స్ డే సెలబ్రేట్ చేయనున్నారు. ఈ రోజు తల్లులందరికి అంకితం చేశారు. పిల్లల పెంపకంతో పాటు వారి ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లి అహోరాత్రులు కష్టపడుతుంది. ఈ అంకితభావం, త్యాగాన్ని గౌరవించటానికి ప్రతి సంవత్సరం మదర్స్ డేను సెలబ్రేట్ చేస్తుంటారు. ఈ రోజును తల్లికి ప్రత్యేకంగా మార్చడానికి, పిల్లలు చాలా రోజుల ముందుగానే సన్నాహాలు చేయడం ప్రారంభిస్తారు. మదర్స్ డే వేడుక ఎలా ప్రారంభమైంది, మే రెండవ ఆదివారం మాత్రమే ఎందుకు నిర్వహిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

మదర్స్ డే ఎలా ప్రారంభమైంది..

మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం తొలుత అమెరికాలో ప్రారంభమైంది. అమెరికాకు చెందిన అన్నా జార్విస్ అనే మహిళ తన తల్లిని అమితంగా ప్రేమించేది. తన తల్లిని చూసుకోవడానికి ఆమె పెళ్లి కూడా చేసుకోలేదు. కానీ తన తల్లి చనిపోయిన తర్వాతి నుంచి.. అన్నా తన తల్లిని చాలా మిస్ అయ్యింది.

తల్లి తన జీవితమంతా తన పిల్లల కోసం ఎంతో చేస్తుంది. కానీ తల్లి త్యాగం, అంకితభావం ఏనాడు ప్రశంసలు అందుకోలేదు. ఇటువంటి పరిస్థితిలో పిల్లలు తమ తల్లుల నిస్వార్థ ప్రేమ, త్యాగం, అంకితభావానికి కృతజ్ఞతలు తెలిపే రోజు రావాలి. అన్నా తల్లి మేలో మరణించింది. కాబట్టి అన్నా తన తల్లి మరణించిన రోజును మదర్స్ డేగా సెలబ్రేక్ చేసుకోవడం ప్రారంభించింది.

మదర్స్ డే మే రెండవ ఆదివారం ఎందుకు నిర్వహిస్తారు?

తన తల్లి మరణం తరువాత, అన్నా తన జీవితమంతా ఇతరుల సేవకు అంకితం చేసింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, గాయపడిన అమెరికన్ సైనికులకు తల్లిలా సేవ చేసింది. ఆమె సేవా స్ఫూర్తిని గౌరవించేందుకు, అప్పటి యూఎస్ అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ఆమె గౌరవార్థం ఒక చట్టాన్ని ఆమోదించారు. మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఆమోదం ఇచ్చారు. యూఎస్ పార్లమెంట్‌లో ఒక చట్టాన్ని ఆమోదించడం ద్వారా, మదర్స్ డేను మే రెండవ ఆదివారం నిర్వహించాలని ప్రకటించారు. మే 9, 1914న అధికారికంగా మొదటి మదర్స్ డే సెలబ్రేట్ చేశారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం మదర్స్ డేను నిర్వహిస్తారు. ఇంతకుముందు ఈ రోజును అమెరికాలో మాత్రమే నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ఐరోపా, భారతదేశం మొదలైన అనేక ఇతర దేశాలలో సెలబ్రేట్ చేస్తుంటారు.

Tags:    

Similar News