Expensive Flat: అంబానీ-అదానీ లేరు.. టాటా కానే కాదు.. దేశంలోనే అత్యంత ఖరీదైన ఫ్లాట్ యజమాని ఎవరో తెలుసా? ధర తెలిస్తే మూర్ఛపోవడమే..!
Most Expensive Flat in India: దేశంలో అత్యంత ఖరీదైన ఇంటి గురించి మాట్లాడిన ప్రతీ సారి, ఎవ్వరికైనా ఒక్క పేరు మాత్రమే గుర్తుకు వస్తుంది. ముఖేష్ అంబానీ యాంటిలియా.
Most Expensive Flat in India: దేశంలో అత్యంత ఖరీదైన ఇంటి గురించి మాట్లాడిన ప్రతీ సారి, ఎవ్వరికైనా ఒక్క పేరు మాత్రమే గుర్తుకు వస్తుంది. ముఖేష్ అంబానీ యాంటిలియా. ముంబైకి దక్షిణాన అల్టామౌంట్ రోడ్డులో ఉన్న అంబానీకి చెందిన యాంటిలియా విలువ రూ.12 నుంచి 15 వేల కోట్లు. ఈ ఇళ్ళు మొత్తం ఓ కొత్త ప్రపంచంలా ఉంటుంది. 27 అంతస్తుల ఈ ఇంట్లో హెలిప్యాడ్, స్విమ్మింగ్ పూల్, థియేటర్, వందలాది వాహనాల పార్కింగ్ వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. అంబానీ యాంటిలియా గురించి చాలా మందికి తెలిసిందే. అయితే దేశంలోనే అత్యంత ఖరీదైన ఫ్లాట్ గురించి మీకు తెలుసా? వివరాలు తెలిస్తే షాక్ అవుతారంతే.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
తాజాగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దేశంలోనే అత్యంత ఖరీదైన ఫ్లాట్ డీల్ జరిగింది. రూ.369 కోట్లతో దేశంలోనే అత్యంత ఖరీదైన అపార్ట్ మెంట్ ఇదే. దక్షిణ ముంబైలోని మలబార్ హిల్స్‌లో షీ-ఫేసింగ్ అపార్ట్‌మెంట్ కోసం అత్యంత ఖరీదైన ఒప్పందం జరిగింది. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన ఫ్లాట్‌గా మారింది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, లోధా గ్రూప్ కంపెనీ మాక్రోటెక్ డెవలపర్స్ ఈ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను సిద్ధం చేసింది. లోధా మలబార్ సూపర్ లగ్జరీ రెసిడెన్షియల్ ఈ అపార్ట్‌మెంట్ దేశంలోనే అత్యంత ఖరీదైన ఫ్లాట్‌గా పరిగణిస్తున్నారు.
ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ లేదా రతన్ టాటా వంటి బడా వ్యాపారవేత్తలు ఈ అత్యంత ఖరీదైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశారని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ప్రసిద్ధ పారిశ్రామికవేత్త జేపీ తపాడియా దేశంలోనే అత్యంత ఖరీదైన ఫ్లాట్ యజమాని. తపాడియా కుటుంబం లోధా మలబార్ సూపర్ లగ్జరీ రెసిడెన్షియల్ టవర్‌లోని 26, 27, 28వ అంతస్తులలో ట్రిప్లెక్స్ ఫ్లాట్‌లను కొనుగోలు చేసింది.
1.08 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అపార్ట్‌మెంట్ అందం దాని షీ-ఫేసింగ్ వ్యూస్. ఫ్లాట్‌లోని డ్రాయింగ్ రూమ్, బెడ్‌రూమ్ నుంచి అరేబియా సముద్రపు అలల అందమైన దృశ్యం కనిపిస్తుంది. విలాసవంతమైన ఫ్లాట్ లోపలి భాగం చూడదగ్గ దృశ్యం. ట్రిప్లెక్స్ అపార్ట్మెంట్ కార్పెట్ ప్రాంతం 27,160 చదరపు అడుగులు. లోధా మలబార్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్కిటెక్చర్ కంపెనీ హఫీజ్ కాంట్రాక్టర్ తయారు చేశారు. ఇంటీరియర్ వర్క్‌ని స్టూడియో హెచ్‌బీఏ పూర్తి చేసింది.
ఈ ఫ్లాట్ కోసం తపాడియా కుటుంబం స్టాంప్ డ్యూటీగా రూ.19.07 కోట్లు చెల్లించింది. బజాజ్ ఆటో చైర్మన్ నీరజ్ బజాజ్ కూడా ఇదే అపార్ట్‌మెంట్‌లో 29, 30, 31 అంతస్తుల్లో ట్రిప్లెక్స్‌ను కొనుగోలు చేశారని, అందుకు రూ.252.5 కోట్లు చెల్లించారని తెలిపారు.
JP తపాడియా 1990లో ఫెమీ కేర్‌ను స్థాపించిన ప్రముఖ వ్యాపారవేత్త. అతను ఈ కంపెనీని చాలా పెద్దదిగా చేశాడు. ఈ రోజు ఫెమీ కేర్ ప్రపంచంలోనే అతిపెద్ద కాపర్-టీ తయారీ సంస్థ. 2016లో ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో రూ.60 కోట్లతో 11,000 చదరపు అడుగుల డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశాడు.