Indian Railways: ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్లాట్‌ఫారమ్.. మన దేశంలో ఎక్కడుందో తెలుసా?
World Longest Railway Platform in India: భారతీయ రైల్వేలు ప్రపంచంలో రెండవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్. కానీ, మీకు రైల్వేలకు సంబంధించిన చాలా ప్రాథమిక విషయాలు మీకు తెలియకపోవచ్చు.
World Longest Railway Platform in India: భారతీయ రైల్వేలు ప్రపంచంలో రెండవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్. కానీ, మీకు రైల్వేలకు సంబంధించిన చాలా ప్రాథమిక విషయాలు మీకు తెలియకపోవచ్చు. ఈ రోజు మనం రైల్వేకు సంబంధించిన ప్రత్యేక సమాచారాన్ని తెలుసుకుందాం. దీని గురించి మీరు ఇప్పటి వరకు విని ఉండరు. రైల్వే పొడవైన ప్లాట్‌ఫారమ్ గురించి మీరు ఎప్పుడైన విన్నారా.. అది ఎక్కడ ఉందో తెలుసా? రైల్వేలో పొడవైన ప్లాట్‌ఫారమ్ ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
1.5 కి.మీ పొడవున్న ప్లాట్‌ఫారమ్ ఎక్కడుందంటే..
ఈ ప్లాట్‌ఫారమ్ 1366.4 మీటర్లు అంటే దాదాపు ఒకటిన్నర కిలోమీటరు పొడవు ఉంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్లాట్‌ఫారమ్ UPలోని గోరఖ్‌పూర్ జంక్షన్‌లో ఉంది. ఈ రైల్వే భాగం ఈశాన్య రైల్వే పరిధిలోకి వస్తుంది.
రీ-మోడలింగ్ పని 2013లో పూర్తయింది.
ఈ రైల్వే ప్లాట్‌ఫారమ్ రీ-మోడలింగ్ పని అక్టోబర్ 2013లో పూర్తయింది. ఆ తర్వాత ఈ ప్లాట్‌ఫారమ్ పేరు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా నమోదు అయింది. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ప్లాట్‌ఫారమ్ లేదు.
గోరఖ్‌పూర్ కంటే ముందు ఖరగ్‌పూర్‌లో..
గోరఖ్‌పూర్ స్టేషన్ కంటే ముందు, ఈ రికార్డు పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ సమీపంలో ఉంది. ఆ సమయంలో ఈ ప్లాట్‌ఫారమ్ పొడవు 1072.5 మీటర్లు. అయితే గోరఖ్‌పూర్ స్టేషన్‌లో రీ-మోడలింగ్ పని చేసిన తర్వాత, గోరఖ్‌పూర్ పొడవు గరిష్టంగా మారింది.
ప్రతిరోజూ 150 కంటే ఎక్కువ రైళ్లు ..
గోరఖ్‌పూర్ జంక్షన్ ఈ ప్లాట్‌ఫారమ్ పొడవు చాలా ఎక్కువ. 26 కోచ్‌లతో రెండు రైళ్లను ఒకేసారి పార్క్ చేయవచ్చు. ఈ జంక్షన్‌లో రోజూ పెద్ద సంఖ్యలో రైళ్లు వచ్చి వెళ్తుంటాయి. ఈ జంక్షన్ మీదుగా రోజుకు దాదాపు 170 రైళ్లు ప్రయాణిస్తాయి.