Indian Railways: దేశంలోనే అతి చిన్న రైల్వే స్టేషన్ ఏంటో తెలుసా? పేరు వింటే ఆశ్చర్యపోతారంతే..!

IB Railway Station: భారతదేశంలో వేల సంఖ్యలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వాటి పేర్లు చాలా పొడవుగా ఉంటాయి. అయితే, కొన్నింటికి చాలా చిన్న పేర్లు ఉన్నాయని తెలుసా? ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు.

Update: 2023-05-22 05:12 GMT

Indian Railways: దేశంలోనే అతి చిన్న రైల్వే స్టేషన్ ఏంటో తెలుసా? పేరు వింటే ఆశ్చర్యపోతారంతే..

Indian Raiways Station Short Name: భారతదేశంలో వేల సంఖ్యలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వాటి పేర్లు చాలా పొడవుగా ఉంటాయి. అయితే, కొన్నింటికి చాలా చిన్న పేర్లు ఉన్నాయని తెలుసా? ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అలాగే వందల్లో రైల్వే ప్లాట్‌ఫారమ్‌ల గుండా వెళ్తుంటారు. ప్రయాణీకుడు రైలులో కూర్చున్నప్పుడు, ఖచ్చితంగా తను ఆగబోయే స్టేషన్ పేరు తెలుసుకోవాలనుకుంటాడు. ఈ రోజు భారతదేశంలోనే అత్యంత పొట్టి పేరుతో ఉన్న రైల్వే స్టేషన్‌ని మీకు పరిచయం చేస్తున్నాం. ఈ రైల్వే స్టేషన్ చాలా ప్రత్యేకమైన రైల్వే స్టేషన్. ఈ విషయాన్ని స్వయంగా రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారతీయ రైల్వేకు చాలా పాత చరిత్ర ఉంది. ప్రజలకు దాని గురించి చాలా తక్కువ తెలుసు.

ఈ స్టేషన్‌కు దేశంలోనే అతి చిన్న పేరు..

భారతీయ ట్రాక్‌లపై నడుస్తున్న ప్యాసింజర్ రైళ్లు దాదాపు ప్రతి ముఖ్యమైన స్టేషన్‌లో ఆగుతుంటాయి. అయితే ఆ స్టేషన్‌లో ఆగి వెళ్లే సమయంలో, ప్రయాణికులు అది ఏ రైల్వే స్టేషన్ అని తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు. తాజాగా మేం మీకు అలాంటి ఓ పేరు చెప్పబోతున్నాం. దాని గురించి తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

భారతదేశంలో అత్యంత పొట్టి పేరు కలిగిన రైల్వే స్టేషన్ ఐబీ. దీనిని ఆంగ్లంలో IB స్టేషన్ అని పిలుస్తారు. ఈ రైల్వే స్టేషన్ ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు ఈ స్టేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ప్రారంభమైన వెంటనే ముగుస్తుంది. దీనికి సంబంధించి, రైల్వే మంత్రిత్వ శాఖ తన ట్వీట్‌లో ఇలా రాసుకొచ్చింది.. "ఒడిశాలోని ఐబీ రైల్వే స్టేషన్‌కు భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లోని అన్ని స్టేషన్లలోకెల్లా చిన్న పేరు ఉందని మీకు తెలుసా. దీని పేరు ఐబీ. దీనికి ఐబీ నది నుంచి ఆ పేరు వచ్చింది. ఇది మహానదికి ఉపనది." అంటూ రాసుకొచ్చింది.


Tags:    

Similar News