Indian Railways: అధిక లగేజీతో రైలులో ప్రయాణిస్తున్నారా.. భారీ ఫైన్‌లు పడే ఛాన్స్.. ఏ ట్రైన్‌లో ఎంత తీసుకెళ్లాలంటే?

Indian Railways: కోట్లాది మంది ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే అనేక రైళ్లను నడుపుతోంది.

Update: 2023-06-09 12:30 GMT

Indian Railways: అధిక లగేజీతో రైలులో ప్రయాణిస్తున్నారా.. భారీ ఫైన్‌లు పడే ఛాన్స్.. ఏ ట్రైన్‌లో ఎంత తీసుకెళ్లాలంటే?

Indian Railways: కోట్లాది మంది ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే అనేక రైళ్లను నడుపుతోంది. భారతదేశ రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటిగా పేరుగాంచింది. ప్రయాణీకుల భద్రత కోసం భారతీయ రైల్వే అనేక నియమాలను రూపొందించింది. తద్వారా వారు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉండదు. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ కోట్లాది మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. పెద్ద మొత్తంలో లగేజీని తీసుకుని రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు చాలా మంది ఉండటం గమనార్హం. రైలులో అవసరానికి మించి లగేజీలు తీసుకుని ప్రయాణిస్తున్నారా.. అయితే, ఇబ్బందులు తప్పవు. అలాంటి సమయంలో భారతీయ రైళ్లలో లగేజీ ఎంతవరకు తీసుకెళ్లొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

భారతీయ రైళ్లలో ప్రయాణిస్తుంటే మీరు మీతో పాటు 40 నుంచి 70 కిలోల బరువుతో ప్రయాణించవచ్చని తప్పక తెలుసుకోవాలి. అంతకు మించి ఎక్కువ తీసుకెళ్తే మాత్రం కచ్చితంగా ఇబ్బందులు తప్పవు.

మరోవైపు ఎక్కువ లగేజీతో భారతీయ రైళ్లలో వెళుతున్న సందర్భంలో ఎక్కువ డబ్బు చెల్లించవలసి ఉంటుంది. ముఖ్యంగా రైలులో స్లీపర్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నట్లయితే కేవలం 40 కిలోల బరువుతో ప్రయాణించవచ్చు.

అలాగే ఏసీ టూ టైర్‌లో ప్రయాణిస్తున్నట్లయితే.. ఈ సందర్భంలో మీరు మీతో పాటు 50 కిలోల బరువుతో ప్రయాణించవచ్చు. అలాగే ఫస్ట్ ఏసీలో ప్రయాణిస్తున్నట్లైతే 70 కిలోల బరువుతో ప్రయాణించవచ్చు. అవసరానికి మించి లగేజీతో రైళ్లలో ప్రయాణించకూడదని గుర్తుంచుకోవాలి. ఎక్కువ లగేజీ ఉంటే మాత్రం తప్పుకుండా లగేజ్ వ్యాన్‌ను బుక్ చేసుకోవచ్చు. లేదంటే టీసులు ఫైన్‌ విధించే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News