India Largest Railway Junction: దేశంలో ఏ నగరానికి వెళ్లాలన్నా.. ఇక్కడి నుంచే ట్రైన్.. అతిపెద్ద రైల్వే జంక్షన్ ఎక్కడుందో తెలుసా?

Largest Railway Junction: దేశంలోనే అతిపెద్ద రైల్వే జంక్షన్ ఎక్కడ ఉందో తెలుసా? ఈ జంక్షన్ ఢిల్లీ-ముంబైలో కాదు ఎన్‌సిఆర్‌లోని ఒక చిన్న పట్టణంలో ఉంది. మీరు ఈ జంక్షన్ నుంచి దేశంలోని ఏ నగరానికి అయినా రైలును అందుకోవచ్చు.

Update: 2023-05-18 05:30 GMT

India Largest Railway Junction: దేశంలో ఏ నగరానికి వెళ్లాలన్నా.. ఇక్కడి నుంచే ట్రైన్.. అతిపెద్ద రైల్వే జంక్షన్ ఎక్కడుందో తెలుసా?

Largest Railway Junction in India: ట్రైయిన్‌లో చాలాసార్లు ప్రయాణించి ఉంటారు. ఈ సమయంలో అనేక రైల్వే స్టేషన్, జంక్షన్లను కూడా చూసి ఉంటారు. రైల్వే జంక్షన్‌ను స్టేషన్ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ రైల్వే లైన్ ఏకకాలంలో అనేక దిశలలో ప్రయాణిస్తుంటాయి. అంటే, ఇక్కడ నుంచి వివిధ నగరాలకు వెళ్లే రైళ్లను అందుకోవచ్చు. దేశంలోనే అతి పెద్ద రైల్వే జంక్షన్ ఎక్కడుందో తెలుసా? ఈ జంక్షన్ ఢిల్లీ-ముంబై, కోల్‌కతా లేదా చెన్నైలో కాదు, ఎన్‌సీఆర్‌లోని ఒక చిన్న నగరంలో ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఈ జంక్షన్ నుంచి భారతదేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లే రైలును అందుకోవచ్చు. ఈ రోజు మనం ఈ జంక్షన్ గురించి వివరంగా తెలుసుకుందాం.

దేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్..

దేశంలోని ఈ అతిపెద్ద రైల్వే జంక్షన్ పేరు మధుర రైల్వే జంక్షన్. మధుర జిల్లాలో నిర్మించిన ఈ జంక్షన్ ఉత్తర మధ్య రైల్వే పరిధిలోకి వస్తుంది. ఈ స్టేషన్‌లో మొత్తం 10 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. వీటిపై రైళ్ల రాకపోకలు పగలు, రాత్రి కొనసాగుతాయి. ఈ జంక్షన్ ద్వారా దేశంలోని ఏ నగరానికైనా వెళ్లేందుకు ట్రైన్‌ను అందుకోవచ్చు.

రైళ్లు 7 మార్గాల్లో నడుస్తాయి..

మధుర జంక్షన్ నుంచి 7 మార్గాల్లో రైళ్లు నడుస్తాయి. ఇక్కడ నుంచి దేశంలోని దాదాపు ప్రతి ప్రధాన నగరానికి రైలు సులభంగా కనెక్టివిటీ ఉంటుంది. 1875లో మొదటిసారిగా ఈ జంక్షన్‌లో రైలును నడిపారు. అనంతరం దాదాపు 47 కి.మీ మేర రైలును నడిపారు. ఆ తరువాత 1889 సంవత్సరంలో, మధుర-బృందావన్ మధ్య 11 కి.మీ పొడవైన మీటర్ గేజ్ రైలు మార్గాన్ని ప్రారంభించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, ఇక్కడ 7 రైలు మార్గాలు క్రమంగా పెంచారు. దీని కారణంగా ఇది దేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్‌గా మారింది.

దేశంలోనే రెండవ ప్రధాన కూడలి..

దేశంలో మధుర రైల్వే జంక్షన్ తర్వాత రెండవ అతిపెద్ద రైల్వే జంక్షన్ తమిళనాడులోని సేలం రైల్వే జంక్షన్. మొత్తం 6 రైల్వే నెట్‌వర్క్‌లు అక్కడి నుంచి వెళ్తాయి. ఆ తర్వాత లిస్టులో 5 రైల్వే మార్గాలు ఉన్న విజయవాడ, బరేలీ జంక్షన్‌లు ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాయి.

సుందరీకరణ పనులు..

మధుర రైల్వే జంక్షన్ అత్యధికంగా టికెట్లు బుక్ అయ్యే స్టేషన్లలో ఒకటిగా పేరుగాంచింది. అయినప్పటికీ, ఇది పరిశుభ్రతలో మాత్రం పెద్ద సమస్యగా మిగిలిపోయింది. దీనిని అధిగమించడానికి రైల్వే నిరంతరం ఇక్కడ ప్రయత్నిస్తోంది. ఈ జంక్షన్ సుందరీకరణకు ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది. మధుర-బృందావనం చారిత్రక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, అక్కడ జంక్షన్‌ను ఆధునికంగా మారుస్తున్నారు.

Tags:    

Similar News