Swapna Shastra: కలలో ఈ జంతువులు కనిపిస్తే అదృష్టం వరించినట్లే..!
Swapna Shastra: కలలో ఈ జంతువులు కనిపిస్తే అదృష్టం వరించినట్లే..!
Swapna Shastra: కొంతమందికి నిద్రలో వింత వింత కలలు వస్తాయి. అందులో కొన్ని చాలా భయంకరంగా ఉంటాయి. మరికొన్ని నవ్వుతెప్పించే విధంగా ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం నిద్రలో మీరు చూసే కలలు నిజ జీవితంలో ఎంతో కొంత సంబంధం కలిగి ఉంటాయి. మీరు కలలో సింహం, ఏనుగు, గుర్రం లేదా మరేదైనా జంతువును చూస్తే దాని అర్థం ఏంటో ఈ రోజు తెలుసుకుందాం.
కలలో ఎలుగుబంటి, కుందేలు కనిపిస్తే..
ఒక వ్యక్తి కలలో ఎలుగుబంటిని చూస్తే అది శుభ సంకేతంగా చెప్పవచ్చు. కలలో ఎలుగుబంటిని చూడటం అంటే త్వరలో కొన్ని శుభవార్తలను అందుకోబోతున్నారని అర్థం. కుందేలు చాలా మృదువైన జంతువు. అంటే జీవిత భాగస్వామితో మీ సంబంధంలో మాధుర్యం పెరుగుతుందని అర్థం. దీంతో నిలిచిపోయిన పనులు త్వరలో పూర్తి కాబోతున్నాయని అర్థం.
కలలో సింహం, జీబ్రా కనిపిస్తే..
కలలో జీబ్రా కనిపిస్తే జీవితంలో మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయని, మీ అభివృద్ధికి కొత్త మార్గాలు తెరవబోతున్నాయని స్వప్నశాస్త్రం చెబుతోంది. కలలో సింహం కనిపిస్తే త్వరలో మీరు విజయపథంలో ముందుకు సాగబోతున్నారని, కోర్టు కేసులలో పెద్ద విజయం సాధించబోతున్నారని అర్థం.
కలలో ఏనుగు, ఆవు, గుర్రం కనిపిస్తే..
కలలో ఏనుగు కనిపిస్తే జీవితంలో శుభసూచకమని స్వప్న శాస్త్రం చెబుతోంది. కలలో గుర్రాన్ని చూడటం అంటే మీ కెరీర్, వ్యాపారం కొత్త ఎత్తుకు చేరుకోబోతున్నాయి. మీ జీవితంలో ఏదైనా ఇబ్బంది ఉంటే అది అంతం అవుతుంది. కలలో ఆవును చూసినట్లయితే అది పురోగతి మార్గంలో ముందుకు సాగడాన్ని సూచిస్తుంది.