Home Vastu: ఈ మొక్క వేరుని మెయిన్ డోర్‌కు వేలాడదీస్తే సరి.. ఇంట్లో కనక వర్షమే.. శ్రేయస్సు, ఆనందాలకు కొదువే ఉండదిక..!
వాస్తు శాస్త్రంలో ప్రతి దిశ, వస్తువులకు సంబంధించి నియమాలు ఉన్నాయి. తద్వారా ఇంట్లో సానుకూలత ఉంటుంది.
Home Vastu: వాస్తు శాస్త్రంలో ప్రతి దిశ, వస్తువులకు సంబంధించి నియమాలు ఉన్నాయి. తద్వారా ఇంట్లో సానుకూలత ఉంటుంది. ఇంట్లో శ్రేయస్సు, ఆనందం, శ్రేయస్సు ఉండాలంటే.. ఇంటి ప్రత్యేక దిశలు, ప్రదేశాలలో శుభ విషయాలు లేదా చిహ్నాలను ఉంచడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి ఇంటి వాస్తు దోషాలను తొలగిస్తుంటాయి. ఈ రోజు మనకు వాస్తు శాస్త్రానికి సంబంధించిన అద్భుత పరిహారం గురించి తెలుసుకుందాం. ఇలా చేయడం ద్వారా డబ్బు అయస్కాంతం వలె ఇంటికి ఆకర్షించబడుతుంది. ఇల్లు సంపద, ఆనందం, శ్రేయస్సుతో నిండి ఉంటుంది.
తులసి మొక్కతో..
మతం, జ్యోతిష్యం, వాస్తు దృష్టిలో తులసి చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తుంటారు. తులసిని హిందువుల ఇంటిలో ప్రతి నిత్యం పూజిస్తుంటారు. ఇది లక్ష్మీ స్వరూపంగా పరిగణింస్తుంటారు. తులసి మొక్కను పూజించడం ద్వారా లక్ష్మి ప్రసన్నురాలై.. తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. తులసి మొక్క ఆకు నుంచి వేరు వరకు చాలా శుభప్రదమైనది. అలాగే ఉపయోగకరంగా ఉంటుంది. మతం, వాస్తుతో పాటు తులసికి ఔషధ ప్రాముఖ్యత కూడా చాలా ఎక్కువ. వాస్తు శాస్త్రంలోనూ తులసి మొక్కను పరిహారంగా ప్రస్తావించారు. దీని ద్వారా ఇంట్లో డబ్బు ప్రవాహం వేగంగా పెరుగుతుంది.
ఇంటి ప్రధాన ద్వారం వద్ద తులసి మొక్కను ఉంచాలి..
తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఏ ఇంట్లో తులసి మొక్క ఉంటే లక్ష్మీదేవి నిత్యం నివసిస్తుంది. దానిని ప్రతిరోజూ పూజిస్తారు. ఆ ఇంట్లో చాలా సంతోషం, ఐశ్వర్యం ఉంటాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం వద్ద తులసి మొక్కకు సంబంధించిన ఏ భాగాన్ని వేలాడదీసినా సరిపోతుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో శాంతి ఉంటుంది. ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. ఎందుకంటే ఈరోజుల్లో కట్టిన ఇల్లు లేదా ఫ్లాట్ కొనడం వల్ల వాస్తు దోషాలు చాలా ఉంటుంటాయి. ఈ ఒక్క తులసి మూలాధారంతో వాటిని తొలగించుకోవచ్చు.
తులసి వేరును ఇలా కట్టండి..
ఇంటి ప్రధాన ద్వారం వద్ద తులసి వేరును వేలాడదీయడానికి లేదా కట్టడానికి, ముందుగా తులసి వేరును గంగాజలంతో శుభ్రం చేయాలి. తర్వాత ఒక్క ఎర్రటి గుడ్డలో కొంత బియ్యం, తులసి వేరు వేసి ఒక గుడ్డ కట్టాలి. తర్వాత ఈ మూటను ఇంటి మెయిన్ డోర్ మీద కట్టాలి.
(గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. హెచ్‌ఎంటీవీ వీటిని ధృవీకరించలేదు.)