New Year: క్యాలెండర్ ఎలా పుట్టింది.. మన క్యాలెండర్ స్పెషాలిటీ ఏంటీ?
New Year: కొత్త సంవత్సరం అనగానే సెలబ్రేషన్స్ కన్నా ముందుగా గుర్తొచ్చేది క్యాలెండరే.
New Year: కొత్త సంవత్సరం అనగానే సెలబ్రేషన్స్ కన్నా ముందుగా గుర్తొచ్చేది క్యాలెండరే. ఏ పండుగలు ఎప్పుడొచ్చాయ్.. సెలవులు ఎప్పుడున్నాయి చెక్ చేయడం మనలో చాలా మంది చేసే పనే. క్యాలెండర్ ప్రామాణికంగానే రోజులు లెక్కించడం, పనిదినాలు, పనిదినాలకు తగిన వేతనం, పరిమితులు వంటివి ఉంటాయి. మనిషి పుట్టుక మొదలు చనిపోయే వరకు ఎంత కాలం జీవించాడని లెక్కించానికి కూడా క్యాలెండర్ తప్పని సరి. మరి అసలు ఈ క్యాలెండర్ ప్రస్తుతం ఉన్న రూపంలోకి ఎలా వచ్చింది? దాని వెనుక హిస్టరీ ఎంటో ఓ సారి తెలుసుకుందాం.
మనిషి ఆపినా ఆగనిది క్యాలెండర్‌లోని తేదీ. రోజులు,నెలలు, సంవత్సరాలు చూస్తుండగానే అలా గడిచిపోతాయి. గడిచిన సంవత్సరాన్ని తీసుకురావడం అనేది అసాధ్యం. ఆ ఏడు ఇలా జరిగింది... ఈ ఏడు అలా జరిగిందని చెప్పుకోవడమే కాని... పునరావృతం చేయలేము. అయితే రోజులు, నెలలు, సంవత్సరాలు లెక్క గట్టేందుకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు వివిధ విధానాలను అనుసరించారు. మన దేశంలో కూడా చాలా క్యాలెండర్లే చలామణీలో ఉన్నాయి.
మన దేశంలో చాలా క్యాలెండర్లు చలామణీలో ఉన్నా... ఇవి ఆయా ప్రాంతాల సంప్రదాయాలకు అనుగుణంగా సోలార్, లూనార్ పద్ధతులతో ఉంటాయి. కామన్‌గా అన్ని క్యాలెండర్లలోనూ 12 నెలలే ఉన్నా... వీటికి ప్రత్యేకంగా కొద్దిపాటి మార్పులతో ఒకే రకమైన పేర్లుంటాయి. ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాల కదలిక ప్రకారం నెలలు, వాటి సమయం, పండుగలు వంటి వివరాలుండటం మరో ప్రత్యేకత. స్వాతంత్రం వచ్చాక మన దేశానికొక ప్రామాణిక హిందూ క్యాలెండర్ రూపొందించాలన్న ఉద్దేశంతో 1957లో క్యాలెండర్ రిఫార్మ్ కమిటీ ఏర్పడింది. ఇది శాలివాహనుడి ఆధారంగా శక సంవత్సరాన్ని క్రీస్తు శకం 78గా ఖాయం చేసుకుంది. ఆ ప్రకారంగా క్యాలెండర్ అమల్లోకి వచ్చిన రోజును 1879 చైత్ర మాసం ఒకటో రోజుగా ప్రకటించింది. ఇది క్రీస్తు శకం సంవత్సరాని కంటే 78 ఏళ్ల వెనక్కి ఉంటుంది.
ప్రాచీన కాలం నుంచి కాలాన్ని లెక్కగట్టేందుకు సూర్యుడిని, రోజులు లెక్కించడానికి చంద్రుడిని ఒక గుర్తుగా పెట్టుకునేవారు. క్రీస్తు పూర్వం 4000–3000 మధ్య కాలంనాటి క్యాలెండర్ పద్దతిని తీసుకుంటే... హిందువులు, యూదులు, క్రైస్తవులు, సుమేరియన్‌లు ఇలా పలు ప్రపంచంలోని పలు ప్రాంతాలకు చెందిన వారు ఇదే పద్ధతిని పాటించారు. ఏడాదికి 354 రోజులు కాగా, ప్రతి నెలకు 29 లేదా 30 రోజులు కేటాయించేవారు. క్యాలెండర్లు మొదట్లో చంద్రమానం ప్రకారం ఉండేవి. ఒక ఏడాదిని 12 నెలలుగా విభజించి, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఒక నెలగా లెక్కగట్టేవారు. ఈ క్యాలెండర్ సిస్టమ్‌కి తర్వాత కాలలో కొద్దిపాటి మార్పులు చేసినా, భారతీయ పంచాగంలోమాత్రం చాంద్రమానమే నడుస్తోంది. చైత్రం మొదలుకొని ఫాల్గుణం వరకు నెలకు 29.5 రోజులే ఉంటాయి. సౌరమానానికి తగ్గట్టుగా అడ్జస్ట్మెంట్కోసం మూడేళ్లకొకసారి ఒక అధిక మాసాన్ని జోడిస్తారు.
క్రీస్తు పూర్వం 5000–1750 సుమేరియన్నాగరికత సాగిన రోజుల్లోనూ ఏడాదికి 12 నెలలు, 354 రోజుల లెక్కనే పాటించేవారు. అయితే, అన్ని నెలలకు కామన్పేర్లు ఉండేవి కాదు. తెగలవాళ్లు ఎవరికి తోచినట్లుగా వాళ్లు పిలుచుకునేవారు. దీంతో హిస్టారియన్లు మొదటి నెల, అయిదో నెల అంటూ గుర్తుంచుకునేవారు. ఒక సోలార్ ఇయర్‌లో 365.25 రోజులు కాబట్టి, అడ్జస్ట్మెంట్కోసం ప్రతి మూడేళ్లకొకసారి ఒక నెలను అదనంగా కలుపుకునేవారు. ఈ తేడాని గుర్తించిన మొట్టమొదటి ఖగోళ శాస్త్రవేత్తలు ఇండియన్లే. సుమేరియన్నాగరికత నాటి క్యాలెండర్‌లో వారాలు లేవు. పండుగలు, సెలవులు వంటివి ప్రతి నెలలోనూ మొదటి రోజున, ఏడో రోజున, పదిహేనో రోజున ఉండేవి. ఒక రోజును 12 గంటలుగా విభజించి, ఆరు గంటలు పగలు, ఆరు గంటలు రాత్రిగా గుర్తించేవారు.
ఈజిప్టులో క్యాలెండర్ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న క్యాలెండర్‌కి ఇంచుమించు దగ్గరగా ఉంటుంది. అయితే, ఏడాదికి 365 రోజుల లెక్కతో... ప్రతి నెలకు 30 రోజుల చొప్పున 12 నెలలుండేవి. దీంతో ఏటా అయిదు రోజులు అదనంగా వచ్చేవి. 5,000 ఏళ్లనాటి ఈ క్యాలెండర్సిస్టమ్ని తర్వాతి రోజుల్లో సంస్కరించారు. ఏథెన్స్‌లో క్యాలెండర్మిగతా వాటిలాగే 12 నెలలతో ఉన్నప్పటికీ, ప్రజల అవసరాలకు తగినట్లుగా డెమొక్రటిక్,ఫెస్టివల్,అగ్రికల్చరల్వివరాలతో మూడింటిని రూపొందించేవారు. డెమొక్రటిక్క్యాలెండర్లో ప్రజలు తమ సిటిజెన్షిప్, ఇతర ప్రభుత్వ లాంఛనాలు పూర్తి చేసుకోవాల్సిన తేదీలుండేవి. ఫెస్టివల్ క్యాలెండర్‌లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఉండేవి. అగ్రికల్చరల్ క్యాలెండర్‌లో వ్యవసాయపు పనులకు అనువైన రోజులు ఉండేవి. అన్నీ చంద్రమానంతోనే ఉండడం ఏథెన్స్క్యాలెండర్ప్రత్యేకత.
ప్రస్తుతం ప్రపంచమంతా అనుసరిస్తున్న గ్రిగోరియన్క్యాలెండర్కి ఆధారం జూలియన్క్యాలెండర్. దీనిని రోమన్చక్రవర్తి జూలియస్సీజర్రూపొందించారు. 365 రోజులకొక ఏడాది అనే పద్ధతిని ఆయనే ప్రవేశపెట్టారు. అయితే, లీప్సంవత్సరం లెక్కింపులో తేడా వచ్చేది. దీనిని బాగా కూడికలు, తీసివేతలతో సంస్కరించి గ్రిగోరియన్క్యాలెండర్ని రూపొందించారు. మన దేశంలో అనేక క్యాలెండర్లు చెలామణీలో ఉన్నాయి. ఇవి ఆయా ప్రాంతాల సంప్రదాయాలకనుగుణంగా సోలార్, లూనార్ పద్ధతులతో ఉంటాయి. కామన్‌గా అన్ని క్యాలెండర్లలోనూ 12 నెలలే. వీటికి ప్రత్యేకంగా కొద్దిపాటి మార్పులతో ఒకే రకమైన పేర్లుంటాయి. ఆకాశంలో గ్రహాలు,నక్షత్రాల కదలిక ప్రకారం నెలలు, వాటి సమయం, పండుగలు వంటి వివరాలుండడం మరో ప్రత్యేకత.
హిందూ క్యాలెండర్ప్రకారం 48 నిమిషాలకొక ముహూర్తం చొప్పున మొత్తం 15 ముహూర్తాలు ఒక రోజు. ప్రతి రోజుకు బుధ, గురు, శుక్ర వగైరాలతో ఒక గ్రహం పేరు ఉంటుంది. నెలలను లెక్కించే పద్ధతి గ్రిగోరియన్క్యాలెండర్కి, ఇండియా క్యాలెండర్‌కి తేడా ఉంది. అలాగే, ఇండియాలోనే నార్త్‌లో ఒకలా, సౌత్‌లో మరోలా ఉంటుంది. దక్షిణాదివాళ్లు అమావాస్య మర్నాడును కొత్త నెల మొదటి రోజుగా, ఉత్తరాదివాళ్లు పౌర్ణమిని మొదటి రోజుగా తీసుకుంటారు. అన్ని క్యాలెండర్లలోనూ చంద్రుడు ఆ నెలలో ఏ నక్షత్రంతో కలిసి ఉంటే... ఆ నక్షత్రం పేరును పెట్టడమనేది కామన్.
ఈ పద్ధతిలో నెలకు 29.5 రోజుల చొప్పున ఏడాదికి 354 రోజులు వస్తాయి. దీనిని 365 రోజులకు అడ్జస్ట్చేయడంకోసం ప్రతి మూడేళ్లకూ ఒక అధిక మాసాన్ని లెక్కిస్తారు. తెలుగువారి క్యాలెండర్అంటూ ప్రత్యేకించి ఏమీ లేదు. వ్యవసాయానికి అనువుగా పండుగలు, పర్వదినాలను ప్రత్యేకంగా పేర్కొంటారు. ప్రతి నెల పాడ్యమి నుంచి మొదలవుతుంది. ఏడాదిని ఉత్తరాయణం, దక్షిణాయణంగా విడదీస్తారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తే ఉత్తరాయణంగా, కర్కాటక రాశిలో ప్రవేశిస్తే దక్షిణాయణంగా చెబుతారు. ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు స్థిరంగా ఉంటే, భూమి ఒక అక్షం ఆధారంగా తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడిచుట్టూ పరిభ్రమిస్తోంది. ఈ క్రమంలో బొంగరం మాదిరిగా భూమి ఒకసారి ఉత్తరం వైపు, మరోసారి దక్షిణం వైపు వంగడం వల్ల.. సూర్యుడు ఆయా దిశల్లో కనిపిస్తాడు.