Ganesh Chaturthi 2024 Special: ఇక్కడి వినాయకుడ్ని పూజిస్తే.. 41 రోజుల్లో కోరిన కోర్కెలు తీరుతాయట..!

Dashabhuja Ganapati Temple: దేశంలో అత్యంత అరుదైన వినాయక ఆలయాల్లో ఒకటి రాయదుర్గం దశభుజ గణపతి ఆలయం... పది చేతులు, భార్య సిద్ధి సమేతంగా వెలిసిన ఆదిదేవుడు నానాటికీ పెరుగుతుండడం విశేషం.

Update: 2024-09-07 03:29 GMT

Ganesh Chaturthi 2024 Special: ఇక్కడి వినాయకుడ్ని పూజిస్తే.. 41 రోజుల్లో కోరిన కోర్కెలు తీరుతాయట..!

Dashabhuja Ganapati Temple: దేశంలో అత్యంత అరుదైన వినాయక ఆలయాల్లో ఒకటి రాయదుర్గం దశభుజ గణపతి ఆలయం... పది చేతులు, భార్య సిద్ధి సమేతంగా వెలిసిన ఆదిదేవుడు నానాటికీ పెరుగుతుండడం విశేషం. పూర్ణ టెంకాయతో నైవేద్యం సమర్పించడం అక్కడి ఆచారం. వందల ఏళ్ల కిందట నిర్మించిన గణపతి ఆలయంలో అనాదిగా వస్తున్న ఆచారాలనే ఇప్పటికీ పాటిస్తున్నారు. ఎక్కడా లేని ప్రత్యేకతలు ఇక్కడి విఘ్నేశ్వరుడి ఆలయంలో ఉన్నాయి.

కోరిన కోర్కెలను కొంగు బంగారమై తీర్చే ఇలవేల్పు... శతాబ్ధాలుగా ఎంతో మహిమాన్వితమైన ఆదిదేవుడి ఆలయం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. ఎక్కడైనా వినాయకుడు ఒక్కడే... రెండు చేతులతో ఉండడం సర్వసాధారణం. అనంతపురం జిల్లా రాయదుర్గంలో వెలిసిన వినాయకుడికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. దశభుజ గణపతిగా కీర్తి పొందుతున్న గణపయ్యకు పది చేతులు ఉన్నాయి. కుడివైపున తొండం ఉండి.. పక్కన ఒక చేత్తో భార్య సిద్ధిని ఆలింగనం చేసుకొని ఉంటారు ఆదిదేవుడు. ఇక్కడి మూలమూర్తి విగ్రహం సుమారు 15 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో ఉంటుంది. తొలినాళ్లలో దశభుజి గణపతి విగ్రహం చిన్నదిగానే ఉండేదని కాలక్రమేణా అది పెరుగుతూ వస్తోందని చెబుతున్నారు స్థానికులు 12వ శతాబ్ధంలో ఈ ఆలయాన్ని నిర్మించారని పురవాస్తు శాఖ అధికారులు చెబుతున్నారు.

ఎనిమిది వందల ఏళ్ల కిందట నిర్మించిన ఆలయం విజయనగర రాజుల కాలం నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు. ఆలయంలో ప్రతి ఆదివారం ప్రత్యేక పుజలు నిర్వహిస్తారు. ఏపీతోపాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున ఆలయానికి భక్తులు తరలి వస్తుంటారు. సాధారణంగా ఆది, బుధ వారాల్లో దేవాలయం భక్తులతో సందడిగా ఉంటుంది. ఆలయంలో స్వామి వారికి పూర్ణ టెంకాయను సమర్పిస్తే తమ కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

దేశంలో ఇలాంటి వైవిద్యమైన వినాయక ప్రతిమ ఎక్కడా లేదని చెబుతున్నారు. వందల ఏళ్లుగా వస్తున్న ప్రాచీన సాంప్రదాయాలను పాటిస్తున్న భక్తులను అనుగ్రహిస్తూ ఎన్నో మహిమలకు ఆలయం నిదర్శనంగా నిలుస్తోందని భక్తులు చెబుతున్నారు. ప్రతివారం ఆలయానికి వచ్చి ఆ గణపయ్యను దర్శించుకుంటే మంచి జరుగుతుందని అనుకున్నకార్యాలు నెరవేరుతాయని భక్తుల ప్రగాడ విశ్వాసం. ప్రతినెలా చవితిరోజు ప్రత్యేక పూజలు జరుగుతాయని పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు. వినాయక సంకష్టి కార్యక్రమానికి పెద్దఎత్తున భక్తులు వస్తూ స్వామి వారి దర్శనం చేసుకుంటుంటారని స్థానికులు చెబుతున్నారు.

భక్తులు కోరిన కోరికలు తీరుస్తున్న మహిమాన్వితుడిగా సిద్ధి వినాయకుడిగా పూజలందుకుంటున్న స్వామి వారికి పూర్ణ టెంకాయ సమర్పణ ఇక్కడి ప్రత్యేకత అంటున్నారు అర్చకులు. ఎవరైనా పూర్ణ టెంకాయను స్వామి వద్ద ఉంచి తమ కోరిక చెప్పుకుంటే 41 రోజుల్లో ఆ కోరికలు తీరుతాయని ఆలయ పూజారి చెబుతున్నారు.

Tags:    

Similar News